పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ తాజా
సినిమా ‘గబ్బర్ సింగ్’ ధాటికి నైజాం బాక్సాఫీస్ బీభత్సంగా
షేక్ అవుతోంది. ఆరేంజిలో ఉంది ప్రేక్షకుల తాకిడి.
ప్రేక్షకుల డిమాండ్కు తగిన విధంగా
థియేటర్లు అందుబాటులో లేక పోవడంతో ప్రతి
రోజు సినిమా చూడటానికి వచ్చిన చాలా మంది టిక్కెట్లు
దొరకక అసంతృప్తిగానే వెనుదిరుగుతున్నారు. దీంతో నైజాం డిస్ట్రిబ్యూటర్
దిల్ రాజు థియేటర్ల సంఖ్యను
మరింత పెంచేందుకు ప్రత్నాలు మొదలు పెట్టారు.
గబ్బర్
సింగ్ విన్యాసాలు చూసేందుకు వస్తున్న జనప్రవాహాన్ని చూస్తుంటే తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలవడం ఖాయం అంటున్నారు అభిమానులు.
దాదాపు పదేళ్ల తర్వాత ఎంతో సంతృప్తి కరంగా
పవర్ స్టార్ సినిమాను ఎంజాయ్ చేస్తున్నామని, గబ్బర్ సింగ్ మేనియా రాష్ట్రమంతటా
విస్తరించిందని, పవర్ స్టార్ కెరీర్లో
ఈ చిత్రం మైలురాయిగా మిగులుతుందని సంబరపడిపోతున్నారు.
కలెక్షన్ల
పరంగా గబ్బర్ సింగ్ చిత్రం సెన్సేషన్
సృష్టిస్తోంది. తొలి రోజు దాదాపు
9 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.... వీకెండ్
2వ, 3వ రోజు కూడా
భారీగా కలెక్షన్లు కురిపించింది. ఇప్పుడు అందరి దృష్టి ఫస్ట్
వీక్ కలెక్షన్లపైనే ఉంది. ప్రేక్షకప్రవాహం పెరుగుతుండటం,
థియేటర్ల సంఖ్య కూడా పెంచుతున్న
నేపథ్యంలో రికార్డు ఖాయంగా కనిపిస్తోంది.
పవన్
కళ్యాణ్ సరసన శృతి హాసన్,
మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని,
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్,
ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్,
మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల
ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫోటో
గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం:
దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి,
వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ:
శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.
0 comments:
Post a Comment