ఆ హీరోయిన్కి అక్కినేని కుటుంబ
హీరో సుశాంత్ సరసన అవకాశం వచ్చింది.
కానీ ఆవిడ చూపంతా అదే
కుటుంబంలోని మరో హీరో నాగ
చైతన్యపై పడింది. ఇలాంటి ఇష్టాలు ఉంటే లోలోపల దాచుకోవాలి.
కానీ సుశాంత్ ఫీలవుతాడనే విషయం కూడా పట్టించుకోకుండా
నాగ చైతన్యపై తన కోరికను అందరితో
చెప్పుకుంటోంది. ఆవిడ ఎవరో కాదు...‘లవ్ లీ’ సినిమా ద్వారా పరిచయం అయిన హీరోయిన్ శాన్వి.
‘లవ్లీ’ తర్వాత ఈ భామకు సుశాంత్తో నటించే అవకాశం
వచ్చింది. నాగ్ కార్పొరేషన్ పతాకంపై
రూపొందనున్న ఈ చిత్రంలో నటించే
అవకాశం వచ్చినందుకు సంతోషంగా వున్నా శాన్వి చూపులు మాత్రం నాగచైతన్యపైనే ఉన్నాయి. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా
చేప్పేస్తుంది.
ఈ విషయం గురించి శాన్వీ
మాట్లాడుతూ ‘మామూలు చిత్రాలు ఎన్ని చేసినా కూడా
పెద్దగా గుర్తింపు రాదు. ఒక వేళ
చిన్న చిత్రాలు హిట్ అయినా కూడా
ఆ విజయం దర్శకుడికో లేక
హీరోకో వెళ్లిపోతుంది. కానీ ప్రేక్షకుల దృష్టిలో
పడాలంటే మాత్రం టాప్ హీరో చిత్రాల్లో
లేక వారి కొడుకుల చిత్రాల్లోనే
నటించాలి’ అంటూ
తన మనసులోని కోరికను బయటపెట్టింది శాన్వీ.
అక్కినేని
కుటుంబ హీరో సుశాంత్తో
చేస్తున్నా మీకు సంతృప్తిగా లేదా?
అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.........సంతృప్తిగానే ఉంది కానీ నాగ
చైతన్య నాగార్జున కొడుకు కాబట్టి అతనితో అవకాశం దక్కించుకోడమే లక్ష్యం అంటోంది.
0 comments:
Post a Comment