తిరుపతి
శానససభ నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు.
డిక్లరేషన్పై సంతకం చేయకుండా
వైయస్ జగన్ తిరుమలేశుడ్ని సందర్శించుకోవడంపై
ఆయన విరుచకుపడ్డారు. ఆయన తిరుపతిలో శనివారం
ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హిందువులకు తిరుపతి క్రైస్తవులకు వాటికన్ సిటిలాంటిదని, తిరుమల పవిత్రతను జగన్ దెబ్బ తీశారని
ఆయన అన్నారు.
మత సామరస్యాన్ని గౌరవించాలని, అయితే ఒక మతాన్ని
కించపరిచే విధంగా వ్యవహరించడం ధర్మం కాదని ఆయన
జగన్ను చర్యను తప్పు
పట్టారు. తిరుమలేశుడిని ఎవరైనా దర్శించుకోవచ్చునని, అయితే డిక్లరేషన్ ఇవ్వాల్సి
ఉంటుందని,, మాజీ రాష్ట్రపతి అబ్దుల్
కలామ్ కూడా డిక్లరేషన్పై
సంతకం చేశారని, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా సంతకం
చేసినట్లు గుర్తుందని ఆయన అన్నారు.
డిక్లరేషన్పై సంతకం చేయకుండా
వైయస్ జగన్ దౌర్జన్యంగా జగన్
దర్శనానికి వెళ్లారని ఆయన విమర్శించారు. నాయకుడిగా
వ్యవహరించాల్సిన వ్యక్తి దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, చట్టాన్ని అతిక్రమించడం సరి కాదని ఆనయ
అన్నారు. తిరుపతిని అభివృద్ధి చేయాల్సింది పోయి అపవిత్రం చేస్తున్నారని
ఆయన అన్నారు.
తిరుపతిని
అభివృద్ధి చేసింది, పవిత్రతను కాపాడింది తమ పార్టీయేనని ఆయన
చెప్పుకున్నారు. కాంగ్రెసు అంటేనే రౌడీయిజానికి, మద్యం వ్యాపారానికి కేంద్రంగా
చెప్పాల్సి వస్తోందని ఆయన అన్నారు. బినామీ
పేర్లతో తెల్ల కార్డులతో మద్యం
దుకాణాలు కొనుక్కుని కాంగ్రెసు మద్యాన్ని ఏరులుగా పారిస్తున్నారని ఆయన అన్నారు. మద్దెలచెర్వు
సూరి హత్య కేసులో ప్రధాన
నిందితుడు భాను కిరణ్ను
పెంచి పోషించింది కేూడా వైయస్ రాజశేఖర
రెడ్డి, ఆయన కుమారుడు వైయస్
జగన్ అని చంద్రబాబు ఆరోపించారు.
0 comments:
Post a Comment