విశాఖపట్నం/
ఆదిలాబాద్/ విజయవాడ: ప్రేమ వ్యవహారం రెండు
కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన
సంఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది. అబ్బాయి
ఇంటిపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. అబ్బాయి
తల్లిని వివస్త్రను చేసి దారుణంగా కొట్టారు.
ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా
తగరపువలస గ్రామంలో జరిగింది. ఈ చిచ్చుతో గ్రామం
అట్టుడికింది.
సత్యనారాయణపేటకు
చెందిన అనిల్, కుమారి ప్రేమించుకున్నారు. అయితే కులాలు వేరు
కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. కుమారికి వేరే వ్యక్తితో ఆమె
కుటుంబ సభ్యులు వివారం జరిపించారు. అయినప్పటికీ ప్రేమికులు ఇద్దరు పరారయ్యారు. దీంతో కుమారి బంధువులు
అనిల్ ఇంటిపై దాడి చేసి అతని
తల్లి నూకరత్నాన్ని చితకబాదారు.
అనుమానం
మహిళ పాలిటి యమపాశంగా మారింది. ఓ భర్త భార్యపై
అనుమానంతో గొంతు నులిమి హత్య
చేశాడు. ఈ సంఘటన అదిలాబాద్
జిల్లా మంచిర్యాలలో అశోక్ రోడ్డులో చోటు
చేసుకుంది. ఆ తర్వాత నిందితుడు
పోలీసు స్టేషనులో లొంగిపోయాడు.
కృష్ణా
జిల్లా కంకిపాడు మండలంలో ఉప్పులూరులో కుటుంబ కలహాలతో భార్యభర్తలు ఘర్షణకు దిగారు. వివాదం ముదరడంతో క్షణికావేశంతో వారిద్దరు బ్లేడుతో గొంతు కోసుకున్నారు. ఈ
ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త పరిస్థితి ఆందోళనకరంగా
ఉంది. భార్య మాత్రం ప్రాణాపాయం
నుంచి బయటపడింది. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
0 comments:
Post a Comment