గతంలో
భారతీయ సినీ పరిశ్రమలో అందాల
తారగా వెలుగొందిన హీరోయిన్ శ్రీదేవి పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు
శ్రీదేవి అభిమానుల దృష్టంతా ఆమె కూతురు జాహ్నవిపైనే.
త్వరలో జాహ్నవి హీరోయిన్గా తెరంగ్రేటం చేస్తుందని
అంతా భావిస్తున్న తరుణంలో...షాకింగ్ న్యూస్ చెప్పి అభిమానులను నిరాశ పరిచింది శ్రీదేవి.
ఓ ప్రముఖ పత్రికతో శ్రీదేవి మాట్లాడుతూ...జాహ్నవి సినిమాల్లోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.
హీరోయిన్ షేపు రావడానికి బరువు
తగ్గించుకోవాలని సూచిస్తున్నారు. కానీ జాహ్నవికి ఇంకా
15 సంవత్సరాలే. జాహ్నవి దృష్టంతా చదువుమీదే పెట్టేలా చూస్తున్నా. సినిమాల్లోకి రావడానికి ఇంకా చాలా సమయం
ఉంది. ఆమెకు మంచి ఎడ్యుకేషన్
అందించాలనేదే నా కోరిక అని
చెప్పింది. నేను టీనేజ్ లో
ఉన్నప్పుడు సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల నా
చదువు పూర్తి చేయలేక పోయాను అని వెల్లడించింది.
జాహ్నవిని
సినిమాల్లోకి తీసుకురావాలనే ఆలోచన కంటే...ఆమె
త్వరగా పెళ్లి చేసుకుని, జీవితంలో సెటిల్ అవ్వాలనేదే నా కోరిక, కానీ
జాహ్నవి సినిమాల్లోకి వస్తానని ఆశ పడితే మాత్రం
ఎంకరేజ్ చేస్తాను అంటూ సమాధానం ఇచ్చింది
శ్రీదేవి.
ఇలా శ్రీదేవి తన కూతురు గురించి
చెప్పిన విషయాలు విని షాకవుతున్నారు అభిమానులు.
శ్రీదేవి వారసురాలిగా జాహ్నవి సినిమాల్లోకి వస్తే ఆమెలో శ్రీదేవిని
చూసుకుందామని అనుకున్నాం. కానీ మా ఆశ
తీరేలా లేదు అంటూ శ్రీదేవి
అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
0 comments:
Post a Comment