రాజమండ్రి:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నుండి తనకు
బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు
వి. హనుమంత రావు మంగళవారం చెప్పారు.
తనకు సుబ్బారాయుడు పేరుతో అమెరికా నుండి బెదిరింపు ఫోన్
కాల్ వచ్చిందని చెప్పారు. దీనిపై తాను పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు.
సుబ్బారాయుడి
పేరుతో తనకు వచ్చిన ఫోన్
కాల్ చేసింది సుబ్బారెడ్డిగా తాను అనుమానిస్తున్నానని ఆయన చెప్పారు.
జగన్ జోలికి వస్తే జాగ్రత్త అంటూ
తనను హెచ్చరించారని తెలిపారు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా
చూసుకో... జగన్ సంగతి నీకెందుకంటూ
బెదిరించారని తెలిపారు. సాక్షి పత్రిక, సాక్షి టివి ఛానల్లో
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
ఫోటోను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
సాక్షి
పత్రికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా పెయిడ్ ఆర్టికల్స్ వస్తున్నాయని ఆయన విమర్శించారు. దీనిపై
తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. లక్ష కోట్లు దోచుకున్న
వైయస్ జగన్ ఏ రామరాజ్యం
తెస్తాడో అర్థం కావడం లేదని
మండిపడ్డారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్ దొరికిన
తర్వాత జగన్ అసలు స్వరూపం
బయటపడిందన్నారు.
జగన్కు వైయస్ గుణాలు
కాకుండా వాళ్ల తాత రాజారెడ్డి
గుణాలు వచ్చాయన్నారు. ఎన్నికల కమిషన్ తక్షణమే స్పందించి సాక్షి పేపర్లో వైయస్
రాజశేఖర రెడ్డి ఫోటో తొలగించాలని డిమాండ్
చేశారు. కాగా విహెచ్ తూర్పు
గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారంలో
పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన
ద్రాక్షారామంలో మాట్లాడారు.
0 comments:
Post a Comment