త్వరలో
వరణ్ సందేశ్...వెండి తెరవై వీర్య
దానం చేస్తూ కనిపించనున్నాడని సమాచారం. ‘స్నేహగీతం’,
‘ఇట్స్మై లవ్‌స్టోరీ’ చిత్రాల
దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ‘దానకర్ణ’చిత్రం కోసం వరుణ్ సందేశ్
ని హీరోగా అడిగి ఓకే చేయించుకున్నట్లు
తెలుస్తోంది. ఇటీవల ఇదే తరహా
కథాంశంతో బాలీవుడ్లో ‘విక్కీడోనర్’ సినిమా విడుదలై విమర్శలతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు
కూడా అందుకుంటోంది. అయితే ఈ సినిమాకు
‘దానకర్ణ’ చిత్రానికి
ఎలాంటి సంబంధంలేదని దర్శకుడు శ్రీధర్ రెడ్డి చెబుతున్నాడు. ‘చెన్నైకి చెందిన ఓ జంట ఐఐటి
ర్యాంకర్ వీర్యాన్ని దానం చెయ్యమని ఇంట్నట్లో పోస్ట్ చేశారని,
ఈ సంఘటనతో పాటు తను చదివిన
మరికొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ ఈ సినిమాను తెరకెక్కించే
ప్రయత్నం చేయబోతున్నాడని చెప్తున్నాడు.
వీర్య
దానం కధాంశంతో హిందీలో వచ్చిన విక్కీ డోనర్ హిట్ అవటంతో
తెలుగులోనూ అలాంటి కథాంశాలతో సినిమాలు రెడీ అవుతున్నాయి. ఆ
కోవలో మధురా శ్రీధర్ ఓ
చిత్రం తెరకెక్కించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దానకర్ణ,దానకర్ణుడు అనే టైటిల్స్ ని
ఈ చిత్రం కోసం రిజిస్టర్ చేసారు.
ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుపుతున్న ఈ
చిత్రం త్వరలోనే సెట్స్ కు వెళ్లే అవకాశం
ఉంది. మరో ప్రక్క హీరో
సిద్దార్ద తెలుగు,తమిళంలో విక్కీ డోనర్ చిత్రం చేయటానికి
గానూ రైట్స్ తీసుకున్నారు.
ఇక ఈ విషయమై మధుర
శ్రీధర్ ఓ ఇంగ్లీష్ డైలీతో
మాట్లాడుతూ...విక్కీ డోనర్ చూసి నేను
ప్రేరణ పొందలేదు. పేపర్లో వచ్చిన స్పెర్మ్ డొనేషన్ మీద వచ్చిన ఓ
ఆర్టికల్ చదివి కథ రెడీ
చేసుకున్నాను. చెన్నైకి చెందిన ఓ జంట ఆన్
లైన్లో ఐఐటి పాస్ అయిన
వ్యక్తి వీర్యం కావాలంటూ ప్రకటన ఇచ్చారు. అది చదివిన దగ్గరనుంచి
నేను ఆలోచనలో పడి ఆ పాయింట్
మీద సినిమా చెయ్యాలనుకున్నాను. నా సినిమా ఓ
ప్రేమ కథ. సరోగెట్ మదర్
కి,స్పెర్మ్ డొనేటర్ కి మధ్య జరుగుతూంటుంది
అని వివరించారు.
వరుణ్
సందేశ్ విషయానికి వస్తే ..ప్రస్తుతం నీలకంఠ దర్శకత్వంలో చమ్మక చల్లో చిత్రం
చేస్తున్నారు. అలాగే మరో ప్రక్క
కుమార్ బ్రదర్స్ నిర్మాతగా చమక్కు అనే చిత్రం చేస్తున్నారు.
మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ
చిత్రంతో రచయిత నంద్యాల రవి
ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వెన్నెల కిషోర్, ప్రసాద్ బార్వే, వినయ్, సత్యం రాజేష్, ధనరాజ్
తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:
సాయిశ్రీరామ్, సమర్పణ: సుధీర్ దొడ్డ, సహనిర్మాత: పాండు, సంగీతం: కె.ఎమ్.రాధాకృష్ణ.
0 comments:
Post a Comment