మొన్న
శుక్రవారం రిలీజై మార్నింగ్ షోకే సూపర్ హిట్
టాక్ తెచ్చుకున్న చిత్రం గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ ఖుషీ
తర్వాత ఇన్నాళ్లకు ఆ రేంజి హిట్
కొట్టాడంటున్న ఈ చిత్రం ఫస్ట్
డే కలెక్షన్స్ పై అందరికీ ఆసక్తి
ఉన్నా నిర్మాతలు ఇప్పటివరకూ వాటిని అఫీషియల్ గా ప్రకటించలేదు. అయితే
ట్రేడ్ లో చెప్పుకుంటున్న లెక్కలు
చూస్తే అంచనాలను మించి ఫస్ట్ డే
కలెక్షన్స్ అదిరిపోయాయంటున్నారు.
ఫస్ట్
డే కలెక్షన్స్..ఏరియా వైజ్ గా
(షేర్...
కోట్లలో)
నైజాం
--------------- 2.22
సీడెడ్
------------- 1.90
వైజాగ్
------------0.55
ఈస్ట్
గోదావరి --------------
0.83
వెస్ట్
గోదావరి
--------------0.60
కృష్ణా
------------- 0.58
గుంటూరు
---------------- 1.11
నెల్లూరు
------------- 0.36
Total AP---------------- 8.15 Crores
ఇక పైన చెప్పిన లెక్కలు
కేవలం ట్రేడ్ లో ప్రచారంలో ఉన్నవి
మాత్రమే అని గమనించాలి. నిర్మాత
ఖరారు చేసి అఫీషియల్ గా
ప్రకటించినవి కాదు.
ఇక హరీష్ శంకర్ కి
ఎన్టీఆర్ తో తదుపరి చిత్రం
రావటంతో చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ కళ్యాణ్‌ని
ఓ అభిమాని ఏ విధంగా చూడాలని
కోరుకుంటాడో ఆ విధంగా ఆలోచించి
ఆయన అభిమానిగా ‘గబ్బర్ సింగ్’ని తెరకెక్కించాను. పవన్
కళ్యాణ్ అందించిన స్ఫూర్తితో ఈ చిత్రాన్ని ఇంత
బాగా తీయగలిగాను. ఆయన నుంచి నేను
నేర్చుకున్న నీతి, నిబద్ధత, కఠిన
క్రమశిక్షణలే ఈ సక్సెస్కు
కారణం. ఈ సినిమా చూసిన
పెద్ద దర్శకులంతా నన్ను అభినందిస్తుండటం ఆనందంగా
వుంది. పవన్ నటనే నాకు
పెద్ద ఎస్సెట్ అయ్యింది అన్నారు.
0 comments:
Post a Comment