కడప:
రాష్ట్ర ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం
చేశారు. కడప జిల్లా సిద్దవటం
మండలంలోని టక్కోలు, మాచుపల్లె, సంటిగారిపెల్ల, మూలపల్లె, సిద్దవటం, భాకరాపేట, మాధవరం, ఉప్పరపల్లె, ఒంటిమిట్ట మండలంలోని కొన్ని ప్రాంతాలలో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన
ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో
ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్
పాలన సాగుతోందని విమర్శించారు. పేదలు, రైతులను పట్టించుకోని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడితే
ఎంత అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయానీయంగా
ఉందన్నారు. పసుపు రైతులను ప్రభుత్వం
పట్టించుకోవడం లేదని విమర్శించారు. దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
హయాంలో క్వింటాల్ పసుపు రూ.పదహారు
వేలు ఉండగా ప్రస్తుతం రూ.మూడు వేల లోపే
ఉందన్నారు.
చేనేత
రుణమాఫీ కోసం వైయస్ రూ.312
కోట్లు కేటాయిస్తే ఆయన మరణానంతరం ఆ
నిధులు ఏమయ్యాయని అడిగితే పట్టించుకునే నాథుడే లేడన్నారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల అనంతరం
ప్రభుత్వం పడిపోతుందని చెప్పను కానీ.. రాబోయే సువర్ణపాలనకు ఈ ఎన్నికలు నాంది
పలకాలన్నారు.
మీరు
వేసే ఓటుతో పాలకులకు కనువిప్పు
కలగాలని, ఢిల్లీ పెద్దలకూ అర్థం కావాలని ఆయన
పిలుపునిచ్చారు. తమ పాలన వస్తే
భవిష్యత్తులో చేనేతలకు నెలకు రూ.1000 పింఛన్,
పేదల పిల్లల చదువులకు నెలకు రూ.1000, వృద్ధులకు
పింఛన్ రూ.700 మంజూరు చేస్తానని ప్రకటించారు.
0 comments:
Post a Comment