హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మీడియా
నెలసరి ఖర్చు రూ.35 కోట్లుగా
సంబంధిత సంస్థల తరఫు న్యాయవాదులు న్యాయస్థానానికి
తెలియజేశారు. న్యూస్ప్రింట్కు రూ.20 కోట్లు,
సిబ్బంది జీతభత్యాలు రూ.8 కోట్లు, నెలసరి
నిర్వహణ వ్యయం రూ.7 కోట్లు
ఉంటుందని వారు వివరించారు.. సాక్షి
పత్రిక, టీవీ బ్యాంక్ అకౌంట్లను
సీబీఐ స్తంభింపజేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన
రివ్యూ పిటిషన్పై హైకోర్టులో గురువారం
వాదోపవాదాలు జరిగాయి.
బ్యాంక్
అకౌంట్లను స్తంభింపజేస్తే సంస్థ నెలసరి వ్యయానికి
ఇబ్బంది ఎదురవుతుందని, అందువల్ల స్తంభింపజేసిన బ్యాంకు ఖాతాలను పునరుద్ధరించాలని జగన్ తరపు న్యాయవాదులు
కోర్టులో వాదించారు. అయితే నెల మధ్యలో
ఖతాలను స్తంభింపజేసిన విషయాన్ని సిబిఐ తరపు న్యాయవాది
కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సంస్థలను నడుపుకోవడానికి కొత్త బ్యాంక్ ఖాతాలను
తెరుచుకోవచ్చునని సూచించారు. దీనివల్ల సిబ్బంది జీతభత్యాలకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ ఫ్రీజింగ్పై
కౌంటర్ దాఖలు చేసేందుకు గడువు
కావాలనీ కోరారు. ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న న్యాయస్థానం తదుపరి
విచారణను ఈ నెల 21కి
వాయిదా వేసింది.
వైయస్
జగన్ ఆస్తుల జప్తునకు సిబిఐ ఓ ఆథరైజ్డ్
అధికారిని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆథరైజ్డ్ అధికారి
జప్తునకు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారని, కోర్టు
నుంచి అనుమతి పొందిన తర్వాతనే ఆస్తుల జప్తు ప్రారంభమవుతుందని అంటున్నారు.
జననీ ఇన్ఫ్రా, ఇందిరా
టెలివిజన్, జగతి పబ్లికేషన్స్ పరిధిలోని
ఆస్తులను జప్తు చేయడానికి ఏర్పాట్లు
చేస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఆస్తుల
జప్తు మెమోను సిబిఐ తన డైరెక్టరేట్
కార్యాలయానికి పంపుతుందని అంటున్నారు. కాగా, జగన్ ఆస్తుల
కేసులో సిబిఐ దాఖలు చేసిన
రెండో చార్జిషీట్ను కోర్టు పరిగణనలోకి
తీసుకుంది.
ఇదిలా
వుంటే, జగన్ ఆస్తుల కేసులో
అరెస్టయిన పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అధికారి బ్రహ్మానంద రెడ్డిలను పది రోజుల పాటు
సిబిఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ
నెల 28వ తేదీన వారిని
కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. ప్రతి రోజు ఉదయం
గం.9.30 నిమిషాల నుంచి సాయంత్రం గం.5.30
నిమిషాల వరకు విచారించాలని సూచించింది.
న్యాయవాదుల సమక్షంలోనే వారిని విచారించాలని చెప్పింది. దర్యాప్తులో న్యాయవాదులు జోక్యం చేసుకోరాదని కోర్టు ఆదేశించింది. వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని
ఆదేశించింది.
0 comments:
Post a Comment