బెంగళూరు:
సెక్స్ స్కామ్లో ఇరుక్కున్న నిత్యానంద
స్వామీ ఆశ్రమంలో పోలీసులకు గంజాయి, మద్యం, కండోమ్స్ దొరికినట్లుగా తెలుస్తోంది. కర్నాటకలోని ఆయన బిడదిలో నిత్యానందకు
చెందిన ధ్యానపీఠంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రామనగర జిల్లా
జాయీంట్ కలెక్టర్, ఎస్పీ, జిల్లా గ్రామీణ కలెక్టర్ తదితరుల నేతృత్వంలో యాభై మంది పోలీసు
సిబ్బంది విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఆశ్రమం ఆవరణలో గంజాయి, కండోమ్లు, మద్యం సీసాలు,
పాశ్చాత్య సంగీత సిడిలు, తమిళ
వారపత్రికలు పోలీసులకు దొరికాయి.
ఆశ్రమంలో
ఉన్న భక్తులను పోలీసులు అక్కడి నుండి బయటకు పంపించి
వేశారు. కొందరు భక్తుల నుంచి కంప్యూటర్ హార్డ్
డిస్కులను, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత ఆశ్రమానికి తాళం వేసి సీజ్
చేస్తామని అధికారులు చెప్పారు. నిత్యానంద కనిపించకుండా వెళ్లిన తర్వాత ఆశ్రమం నుంచి మొత్తం 200 మంది
భక్తులను తనిఖీ చేసి వారి
వారి ప్రాంతాలకు పంపించి వేశారు. ఆశ్రమంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.
కాగా
పరారైన నిత్యానంద గురించి పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. కొన్ని బృందాలు తమిళనాడుకు వెళ్లాయి. మదురైలోని ఆధీనం మఠంలో ఉన్నాడని,
ధ్యానపీఠం దగ్గర్లోని ఓ రిసార్టులో ఉన్నాడని
ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిత్యానంద పరారు కావడానికి ముందు
కీలకపత్రాలు కాల్చి వేశాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత్రికేయులపై దాడి కేసులో, తనపై
బిడది పోలీసులు కేసు కేసును రద్దు
చేయాలని, ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ నిత్యానంద మంగళవారం హైకోర్టులో వేర్వేరుగా రెండు అర్జీలు వేశాడు.
నిత్యానంద
ఆశ్రమంలో యాభై మంది వరకు
బాలబాలికలు కనిపించారట. మంగళవారం రాత్రి వరకు సాగిని తనిఖీలలో
ఒక భవంతిలో యాభై మంది బాలబాలికలను
గుర్తించారు. వీరందరి వయస్సు ఎనిమిది నుండి పదిహేనేళ్ల వరకు
ఉంటుంది. ఇంకా సర్వర్ రూంలో
20 కంప్యూటర్లు, మూడు హార్డ్ డిస్కులు
స్వాధీనం చేసుకున్నారు. మరో గదిలో విల్లంబులు,
త్రిశూలాలు, ఐదడుగులు ఎత్తైన వెండి విగ్రహాలన, కంచు
సామాగ్రి, వేలాది డివిడిలు, నాలుగు వీడియో కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.
0 comments:
Post a Comment