జూ.ఎన్టీఆర్ తన ఫంధాని మార్చుకుంటున్నారు.
యాక్షన్ నుంచి కామెడీకి, ఆ
తర్వాత పొలిటికల్ సెటైర్ కి వెళ్తున్నాడు. విశ్వసనీయ
సమాచారం ప్రకారం ఎన్టీఆర్,హరీష్ శంకర్ కాంబినేషన్
లో రూపొందే చిత్రం పొలిటికల్ సెటైర్ చిత్రం. ఇందులో ఎన్టీఆర్ చాలా ఎసెంట్రిక్ క్యారెక్టర్
ని పోషించనున్నారు. ఈ చిత్రం టైటిల్
ఎమ్.ఎల్.ఎ. ఎం.ఎల్ ఎ అంటే
మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి. దిల్
రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
అలాగే
పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్
గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్
కి తండ్రిగా చేయబోతున్నారని వినికిడి. ప్రస్తుతం కథా చర్చలు జరుపుకుంటున్న
ఈ సినిమా అతి త్వరలో ప్రారంభం
కానుందని సమాచారం. గబ్బర్ సింగ్ తో సూపర్
హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఈ
చిత్రాన్ని సైతం పెద్ద హిట్
చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. గతంలో ఎప్పుడో నల్లమలుపు
బుజ్జి నిర్మాతగా ఈ ప్రాజెక్టు స్టార్ట్
కావాల్సింది. ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చుతోంది.
మరో ప్రక్క ఎన్టీఆర్-శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న ‘బాద్షా' చిత్రం రెగ్యులర్
షూటింగ్ క్రిందట నెల 20 నుంచి ఇటలీలో మొదలైంది.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ
చిత్రం విశేషాలను నిర్మాత బండ్ల గణేష్బాబు
తెలియజేస్తూ‘ యాక్షన్తో అంశాలతో పాటు
ఓ అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో
వుంది. ఈ చిత్రంలో శ్రీనువైట్ల
కొత్త ఎన్టీఆర్ను చూపించబోతున్నాడు. ఆయన
ఇమేజ్, శారీరక భాషకు సరిగ్గా సరిపోయే
కథ. ఎన్టీఆర్ నుంచి ఆయన అభిమానులు
ఆశిస్తున్న అంశాలు ఇందులో పుష్కలంగా వున్నాయి.
ఇంతకు
ముందు ‘అదుర్స్' చిత్రంలో తన కామెడీ టైమింగ్తో అందర్ని నవ్వించిన
ఎన్టీఆర్ ఈ చిత్రంలో ప్రేక్షకులను
మరింతగా అలరించనున్నాడు. ఇప్పటి వరకు చేయని ఓ
విభిన్నమైన పాత్రను ఆయన ఇందులో చేస్తున్నాడు.
తప్పకుండా చిత్రం అన్ని వర్గాల ఆదరణ
మెప్పు పొందుతుందనే విశ్వాసం వుంది' అన్నారు.
0 comments:
Post a Comment