ఉప ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఐదు స్థానాలలో, కాంగ్రెసు
నాలుగు చోట్ల, తెలుగుదేశం పార్టీ రెండు చోట్ల ఆధిక్యతలో
ఉంది. ఆరు చోట్ల హోరాహోరీగా
ఉంది. పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి
మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన
విషయం తెలిసిందే. ఓటింగ్ సరళిపై ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి సర్వే చేసింది. ఆ
పత్రిక సర్వే వివరాల ప్రకారం...
సీమాంధ్రలోని 17 అసెంబ్లీ స్థానాలలో 11 చోట్ల మాత్రమే మొగ్గు
ఎవరో ఒకరివైపు స్పష్టంగా కనిపించింది. మిగతా ఆరుచోట్ల.. ప్రధాన
ప్రత్యర్థుల మధ్య ఓట్ల మార్జిన్లో పెద్దగా తేడా
రెండు శాతానికి లోపే ఉంది.
దీంతో
పోటీ చాలా తీవ్రంగా ఉందని
చెప్పకనే చెబుతోంది. మొగ్గు విస్పష్టంగా కనిపిస్తున్న పదకొండా స్థానాలలో 5 స్థానాలలో వైయస్సార్ కాంగ్రెసు, నాలుగు చోట్ల కాంగ్రెసు, రెండు
చోట్ల తెలుగుదేశం విజయం సాధించబోతున్నట్లు తేలింది.
పాయకరావుపేట, ఒంగోలు, రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేటలలో జగన్ పార్టీ, నరసన్నపేట,
రామచంద్రాపురం, నరసాపురం, తిరుపతిలలో కాంగ్రెసు, ప్రత్తిపాడు, మాచర్లలో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో ఉన్నాయి.
పోలవరం,
ఉదయగిరి, రాయదుర్గం, అనంతపురం, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరులో పపోటీ చాలా తీవ్రంగా
ఉన్నట్లు, ప్రధాన ప్రత్యర్థుల మధ్య మార్జిన్ రెండు
శాతానికి లోపే ఉన్నట్లు వెల్లడైంది.
ఇక తెలంగాణలో ఎన్నికలు జరిగిన పరకాలలో విజయం తెలంగాణ రాష్ట్ర
సమితిని వరించబోతున్నట్లు స్పష్టమైంది. రెండు శాతం మార్జిన్
సీట్లతో కలిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి విజయావకాశాలు ఉన్న 8 స్థానాలలో ఆరుచోట్ల టిడిపి రెండో స్థానంలో నిలుస్తున్నట్లు
గణాంకాలు చెబుతున్నాయి. పాయకరావుపేట, పోలవరం, ఒంగోలు, ఉదయగిరి, రాయచోటి, అనంతపురంలో రెండో స్థానంలో ఉండే
అవకాశముంది.
రైల్వే
కోడూరు, రాజంపేటలలో మాత్రమే కాంగ్రెసు వైయస్సార్ కాంగ్రెసుకు సమీప ప్రత్యర్థిగా ఉన్నట్లు
వెల్లడైంది. ఇక నెల్లూరు లోకసభ
స్థానంలో వైయస్సార్ కాంగ్రెసు స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించినట్లు తేలింది. ఇక్కడ ఆ పార్టీ
అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి 44.14 శాతం ఓఠ్లతో కాంగ్రెసు
అభ్యర్థి సుబ్బిరామి రెడ్డి 33.73 శాతం ఓట్లతో ఉన్నట్లు
వెల్లడైంది.
0 comments:
Post a Comment