హైదరాబాద్:
పెళ్లి సంబంధాల సైట్లలో తప్పుడు
ప్రొఫైల్ పెట్టిన ఓ వ్యక్తిని హైదరాబాదు
పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి ఎంఎస్, ముంబైలో
ఐఐటి చేసినట్లు చెప్పడమే కాకుండా మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాదు విభాగంలో ఉద్యోగం చేస్తున్నట్లు రవి కిశోర్ అనే
యువకుడు మ్యాట్రీమోనీ సైట్లో పెట్టాడు.
ఈ నకిలీ ప్రొఫైల్తోఆన్
లైన్ ద్వారా 22 మంది మహిళలను మోసం
చేసి డబ్బులు వసూలు చేశాడు.
22 మంది
నుండి డబ్బు గుంజినప్పటికీ 54 మంది
అమ్మాయిలు ఇతని గేలానికి చిక్కారట.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిందితుడు ఓ మేట్రీమొని సైట్లో తప్పుడు వివరాలతో
ప్రొఫైల్ సృష్టించి అవివాహితలతో పరిచయాలు పెంచుకునేవాడు. అవసరాన్ని బట్టి తన సామాజికవర్గాన్ని
మార్చేసేవాడు. వెబ్సైట్లో
పేర్కొన్న వివరాల ఆధారంగా పలువురు మహిళలు అతనితో పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్నారు.
వారితో
చాటింగ్ చేస్తూ బాగా దగ్గరయ్యేవాడు. తన
తండ్రికి ఆపరేషన్ చేయాలని, తల్లికి ప్రమాదం జరిగిందంటూ మభ్యపెట్టి వారి నుండి డబ్బులు
వసూలు చేసేవాడు. ఇలా మొత్తం రూ.10
నుండి రూ.10 లక్షల వరకు
వసూలు చేసి జల్సాలు చేసేవాడు.
ఒక బాధిత మహిళ ఫిర్యాదుపై
విచారిస్తే అతడి మోసాలన్నీ బయటపడ్డాయి.
తాను
54 మంది మహిళలతో ఆన్లైన్లో
సంప్రదింపులు చేశానని, 22 మంది నుండి డబ్బులు
వసూలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు చెప్పారు. ఇతని చేతిలో మోసపోయిన
ఓ యువతి ఈ నెల
7వ తేదిన సిఐడి పోలీసులకు
ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం
మాసాబ్ ట్యాంక్ వద్ద అతనిని అరెస్టు
చేశారు.
0 comments:
Post a Comment