పాలించేవాడికంటే
పోరాటం చేసేవాడికే ఎక్కువ బలముంటుందని నమ్మిన యువకుడు అతను. అధికారం చెలాయించడం
కంటే... నలుగురి అవసరాలు తీర్చడమే ముఖ్యమంటాడు. అడ్డదారుల్లో ఎదిగే అలవాటు అతనికి
లేదు. ఇంకొకర్ని కూడా అలా ఎదగనివ్వడు.
అందుకే అందరి దృష్టిలో అతను
రెబల్గా ముద్రపడ్డాడు. అతను
సాధించిందేమిటో తెరపైనే చూడాలంటున్నారు లారెన్స్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న
చిత్రం 'రెబల్'.
ప్రభాస్
తాజాగా చేస్తున్న చిత్రం 'రెబల్'. ప్రస్తుతం హైదరాబాద్లో చివరి షెడ్యూల్
చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసిన
మీడియాతో దర్శకుడు లారెన్స్ చిత్రం గురించి మాట్లాడుతూ... రెబల్గా ముద్రపడ్డ
ఓ యువకుడు ఎదురు తిరిగి నిలిస్తే
ఎలా ఉంటుందనేదే మా రెబెల్ చిత్రం.
అణిగిమణిగి ఉన్నంత కాలం పిల్లి కూడా
మనకు ఎదురు తిరుగుతుంది. తిరుగుబావుటా
ఎగరేస్తే పులి కూడా వెనక్కు
పరుగెడుతుంది. మా హీరో నమ్మిన
సిద్ధాంతం ఇదే. ఇంతకీ అతని
పోరాటం ఎవరిపై? అనే విషయం తెలుసుకోవాలంటే
మాత్రం సినిమా చూడాల్సిందే అన్నారు.
అలాగే
హీరో పాత్ర చిత్రణ ప్రతి
ఒక్కరికీ నచ్చుతుంది. ఆ పాత్రలో ప్రభాస్
ఒదిగిపోయారు అన్నారు. చిత్రీకరణ చివరి దశకు చేరుకొంది.
త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం. ఆగస్టులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.అలాగే ఈ చిత్రంలో
ప్రభాస్ క్యారెక్టర్ గురించి చెపుతూ.. లాభనష్టాల గురించి అతను ఆలోచించడు. కేవలం
మంచి చెడులే ముఖ్యమంటాడు. గెలుపోటములపై అతనికి బెంగ లేదు. తిరుగుబాటు
చేసి పోరులో నిలవడమే అవసరమంటాడు. అందుకే అతను రెబల్గా
ముద్రవేయించుకున్నాడు. ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టించాడు. ఇంతగా
తిరగబడ్డ ఆ పోరు బిడ్డ
ఎవరు? అతని అసలు లక్ష్యమేమిటి?
తదితర విషయాలు మా సినిమాలో చెప్తున్నాం
అన్నారు.
ప్రభాస్
సరసన తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలు.
ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది.
హీరో,హీరోయిన్స్ పై కీలక సన్నివేశాల్ని
తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:
లారెన్స్ , కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు:
‘డార్లింగ్'స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం:
బాలాజీ సినీ మీడియా.
0 comments:
Post a Comment