నిజ జీవితంలో తండ్రి కూతుళ్లు అయిన కృష్ణ, మంజల
వెండి తెరపై కూడా అలాగే
కనిపించనున్నారు. శ్రీకాంత్ చిత్రం 'సేవకుడు'లో ఈ విశేషం
కనపడనుంది.శ్రీ మహాగణపతి ఫిలిమ్స్
నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్కు జోడీగా ఛార్మి
నటిస్తోంది.దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, ఇందులో సేవకుడిగా శ్రీకాంత్ తన పాత్రలో ఒదిగిపోయారని,
అలాగే ఛార్మి తన పాత్రలో చక్కటి
నటనను కనబరుస్తోందని అన్నారు.
విభిన్న
పాత్రల నటుడిగా శ్రీకాంత్కు పేరుంది. లోగడ
ఆయన నటించిన ఫ్యామిలీ, సెంటిమెంట్, కామెడీ, మాస్ చిత్రాలను ఇందుకు
ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఆయన నటిస్తున్న తాజా
చిత్రాల్లో 'సేవకుడు' ఒకటి. సూపర్ స్టార్
కృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. విదేశాలలో సంపాదించిన డబ్బును ఇండియాలో ఇన్వెస్ట్ చేసి ఇండియా ఆర్ధిక
పరిస్థితిని మెరుగుపరచాలకునే ఎన్నారై పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. గతంలో శ్రీకాంత్
కృష్ణ హీరోగా వచ్చిన‘వారసుడు', ‘రౌడీ అన్నయ్య' అనే
చిత్రాల్లో నటించారు.
ఇక ఇన్నాళ్లూ బిజినెస్ కాకుండా ఆగిపోయిన ఈ చిత్రం ఈ
నెలాఖరుకు కానీ,వచ్చె నెలలో
కానీ రిలీజ్ కానుంది. శ్రీకాంత్ వరస ఫ్లాపులలో ఉండటంతో
ఈ చిత్రం బిజినెస్ కాలేదు. మరో ప్రక్క సముద్ర
సైతం ఈ మధ్య కాలంలో
ఒక్క హిట్టు కూడా ఇవ్వలేదు. ఎవడైతే
నాకేంటి తర్వాత సముద్ర హిట్ రాకపోవటంతో ఈ
చిత్రంపై దాని ఎపెక్టు పడింది.
సమాజంలో
పోరిగి పోతున్న రాజకీయ అవినీతి కథాంశంతో చిత్రం రూపొందతోంది. ఎల్.వి.ఆర్.ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని
నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కథ,
మాటలు: స్వామిజీ విజయ్, ఫొటోగ్రఫీ: పి.ఎస్.బాబు,
సంగీతం: శ్రీకాంత్ దేవా, ఎడిటింగ్: నందమూరి
హరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మేక రమణారావు, లైన్
ప్రొడ్యూసర్: డి.ఎస్.ఆర్.,
నిర్మాణసారథ్యం: తారకరామా ఫిలిమ్స్, నిర్మాత: లగడపాటి శ్రీనివాసరావు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: వి.సముద్ర. ఇంకా ఈ చిత్రంలో
భువనేశ్వరి, జయప్రకాష్రెడ్డి, తెలంగాణా శకుంతల,శివాజీరాజా తదితరులు నటిస్తున్నారు.
0 comments:
Post a Comment