సునీల్
హీరోగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో 'సంబరాల రాంబాబు'
చిత్రం మొదలైన సంగతి తెలిసిందే. అయితే
ఫిల్మ్ సర్కిల్స్ లో ఫస్ట్ షెడ్యూల్
పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగిపోయిందని
వినపడుతోంది. కొద్ది రోజుల క్రితం డి.సురేష్ బాబు సునీల్ సినిమా
అట్టహాసంగా ప్రారంభించారు. కలిసుందాం రా ఫేమ్ ఉదయ
శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా మొదలెట్టారు.
అయితే దర్శకుడుకి, నిర్మాతకి వచ్చిన విభేధాలుతో సినిమా ఆగిపోయినట్లు చెప్పుకుంటున్నారు. అయితే అపీషియల్ గా
న్యూస్ రాలేదు.
ఇక ఈ సినిమా ఆగిపోవటానికి
కారణం బడ్జెట్ ఎక్కువ కావడమేనని చెప్పుకుంటున్నారు. స్క్రిప్టుపై అప్పటికే రెండేళ్లుకు పైగా కసరత్తులు చేసి
ఈ ప్రాజెక్టు కోసం ఎదురుచూసిన ఉదయ్
శంకర్ కి ఇది నిరాశపరిచే
అంశమే. గతంలోనూ సురేష్ ప్రొడక్షన్స్ ఇదే పంధాలో దర్శకుడు
తేజతో మొదలెట్టిన సావిత్రి ప్రాజెక్టుని అటెకెక్కించేసారు. ఆ సినిమామీద తేజ
దాదాపు రెండు సంవత్సరాలుకు పైగా
సురేష్ ప్రొడక్షన్స్ లో కుస్తీ పట్టారు.
ఇక ఈ చిత్రం తీసుకున్న
డేట్స్ లో అమృతం సినిమాని
గుణ్ణం గంగరాజుతో లాగించేయాలని సురేష్ బాబు ప్లాన్ చేసారని
తెలుస్తోంది.గుణ్ణం గంగరాజు డైరక్ట్ చేసిన జస్ట్ ఎల్లో
వారి అమృతం టీవి సీరియల్
తెలుగు వారికి సుపరిచితమే. ఓ హోటల్ చుట్టూ
తిరిగే కథలో అల్లుకున్న ఎపిసోడ్స్
తో వారం వారం తెలుగువారిని
గిలిగింతలు పెట్టిన ఈ టీవీ సీరియల్
సినిమాగా రానుంది. సునీల్ హీరోగా రూపొందే ఈ చిత్రాన్ని గుణ్ణం
గంగరాజే తెరకెక్కించనున్నారని చెప్తున్నారు. సురేష్ బాబు ఈ చిత్రానికి
నిర్మాతగా వ్యవహించనున్నారని సమాచారం.
జస్ట్
యల్లో బ్యానర్ ,సురేష్ ప్రొడక్షన్స్ కలిపి ఈ చిత్రాన్ని
తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే సీరియల్ క్యారెక్టర్స్
తో సినిమా చేస్తారా లేక, కథ కూడా
తీసుకుని చేస్తారా అనేది మాత్రం తెలియటం
లేదు. ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్టు
పూర్తైందని తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని వినికిడి.
పూర్తి స్ధాయి కామెడీగా ఈ చిత్రాన్ని గుణ్ణం
గంగరాజు తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
0 comments:
Post a Comment