న్యూఢిల్లీ:
పదకొండేళ్ల ఓ బాలుడు అద్భుతం
చేశాడు. స్నేహితులతో కలిసి ఆటలాడే వయసున్న
ఢిల్లీ కుర్రాడు శివ్ సఖుజా ఓ
వెబ్‌సైట్‌ను తయారు
చేశాడు. పాఠ్య పుస్తకాలతో కుస్తీలు
పడుతూ వీడియో గేమ్స్ ఆడుకోవాల్సిన వయసులో అతడు ఏకంగా కొత్త
కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందిస్తున్నాడు. అవి మామూలు ప్రోగ్రామ్స్
కాదు. ఈ మధ్యే ఓ
అప్లికేషన్‌ను అంతర్జాతీయ సంస్థ
యాపిల్ తమ వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్
చేసింది.
అందరి
దృష్టినీ ఆకర్శిస్తున్న ఢిల్లీకి చెందిన శివ్ సఖుజా 2008లో
రూపొందించిన వెబ్‌సైట్ ప్రస్తుతం
ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తన
తండ్రి వాడుతున్న మ్యాక్ కంప్యూటర్‌ను చిన్నప్పటి నుంచే
గమనించిన శివ్ దానిపై ఆసక్తి
పెంచుకున్నాడు. అందులోని ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా
తెలుసుకున్నాడు. తన స్నేహితులకు, ఇతరులకు
వచ్చే సందేహాలను తీర్చేవాడు.
ఇదే క్రమంలో తన సమాధానాలను, చిట్కాలను
అందరికీ తెలియజేయాలని ఆ కుర్రాడు భావించాడు.
దాంతో వెబ్‌సైట్ తయారీ
కోసం హెచ్‌టిఎంఎల్ పుస్తకాలు
తిరగేసి, స్వయంగా కంట్రోల్‌యువర్‌మ్యాక్ అనే
వెబ్‌సైట్‌ను రూపొందించాడు.
ఆన్‌లైన్ సమాధానాలతో పాటు
క్విక్‌కాల్, క్విక్‌మెయిలింగ్,
క్విక్‌గేమ్స్ వంటి అప్లికేషన్లను కూడా
రూపొందించి అదే వెబ్‌సైట్‌లో పెట్టాడు.
దీంతో
ఇప్పుడు ఆ వెబ్‌సైట్‌కు నెటిజన్లు బ్రహ్మరథం
పడుతున్నారు. క్విక్‌మెయిలింగ్ అప్లికేషన్‌ను యాపిల్ సంస్థ
కూడా తీసుకుంది. ఈ వెబ్‌సైట్లో
ఆపిల్ కంప్యూటర్ మ్యాక్‌ను ఎన్ని రకాలుగా
ఉపయోగించుకోవచ్చన్న వివరాలను పొందుపర్చాడు. ఈ నాలుగేళ్లలో దానిని
మరింత మెరుగుపర్చాడు. మ్యాక్‌ను కొన్నేళ్లుగా వాడుతున్న
వారికి కూడా తెలియనటువంటి ఎన్నో
అంశాలు ఈ వెబ్‌సైట్లో
దొరుకుతాయి.
ప్రస్తుతం
ఐఫో్ అప్లికేషన్లను తయారు చేయడానికి అవసరమైన
ఆబ్జెక్టివ్-సి లాంగ్వేజ్‌ను
నేర్చుకుంటున్నట్లు శివ్ చెప్పాడు. వీటన్నింటిని
శివ స్వయంకృషితోనే సాధించాడు. నాలుగేళ్ల క్రితం వెబ్‌సైట్‌ను
ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎవరి సహాయం
తీసుకోలేదు. తానే హెచ్‌టిఎంఎల్
కోడ్ నేర్చుకున్నాడు.
0 comments:
Post a Comment