దేశపు
ద్వితీయ అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ కంపెనీ
బజాజ్ ఆటో ఓ 100సీసీ
బైక్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు
తెలుగు డ్రైవ్ స్పార్క్ గడచిన ఫిబ్రవరిలోనే ఓ
కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. కాగా..
తాజా సమాచారం ప్రకారం, ఒకప్పుడు బజాజ్ ఆటో నుంచి
అత్యత పాపులర్ అయిన బాక్సర్ 100సీసీ
బైక్‌ను మళ్లీ తిరిగి
మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది.
గతేడాది
ఆగస్టు నెలలో చడిచప్పుడు లేకుందా
మార్కెట్లో విడుదలైన 150సీసీ ఇంజన్ సామర్థ్యం
కలిగిన 'బాక్సర్ బిఎమ్150' మోటార్‌సైకిల్‌కు మార్కెట్లో పెద్దగా
ఆదరణ లభించలేదు. ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువ మైలేజీనిచ్చే మోటార్‌సైకిళ్లపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో ఎంట్రీ లెవల్ బైక్ సెగ్మెంట్లో
ఎక్కువ మైలేజీనిచ్చే 'బాక్సర్ బిఎమ్100' మోటార్‌సైకిల్‌ను బజాజ్ తాయారు
చేస్తోంది.
అంతేకాకుండా,
కొత్త బజాజ్ బాక్సర్ బిఎమ్100
బడ్జెట్ బైక్‌ను కంపెనీ
ఇప్పటికే ఇండియన్ రోడ్లపై టెస్ట్ రన్ కూడా నిర్వహిస్తోంది.
ప్రస్తుతం ఈ బైక్ స్పై
షాట్స్ (రహస్య చిత్రాలు) ఇంటర్నెట్‌లో హల్ చల్
చేస్తున్నాయి. వీలైనంత త్వరలోనే ఈ బడ్జెట్ బైక్
మార్కెట్లోకి విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్లో కొత్తగా
వచ్చిన హోండా డ్రీమ్ యుగ,
సుజుకి హయాటేలతో పాటుగా, టీవీఎస్ స్టార్, హీరో సిడి డీలక్స్
వంటి మోడళ్లతో బజాజ్ బాక్సర్ బిఎమ్100
పోటీ పడనుంది.
అయితే,
బజాజ్ బాక్సర్ బిఎమ్100 బైక్‌ను బాక్సర్
బిఎమ్150 మాదిరిగానే ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా
కంపెనీ మార్కెట్లో విడుదల చేస్తుందో, లేక ఈ బడ్జెట్
బైక్ ప్రచారం కోసం భారీగానే ఖర్చు
చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.
ముఖ్యంగా రూరల్ మార్కెట్లు, అధిక
మైలేజ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని కంపెనీ ఈ బైక్‌ను
అభివృద్ధి చేసింది. బాక్సర్ బిఎమ్150, బాక్సర్ బిఎమ్100 రెండూ కూడా చూడటానికి
ఒకేలా ఉండి, డిజైన్ పరంగా
చిన్నపాటి మార్పులను కొత్త బాక్సర్‌లో
గమనించవచ్చు.
బజాజ్
డిస్కవర్ 100సీసీ బైక్‌లో
ఉపయోగించిన డిటిఎస్-ఐ 100సీసీ ఇంజన్‌నే కొత్త బాక్సర్
బిఎమ్100లో కూడా ఉపయోగించ
వచ్చని అంచనా. అయితే, ధర విషయంలో మాత్రం
బజాజ్ డిస్కవర్ 100 ధర కన్నా బాక్సర్
బిఎమ్100 ధరే తక్కువగా ఉండే
అవకాశం ఉంది. దీని ఆన్-రోడ్ ధర సుమారు
రూ.40,000 లోపే ఉండొచ్చని అంచనా
(బజాజ్ ప్లాటినా ధర కన్నా తక్కువ).
భారత
టూవీలర్ మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు బజాజ్ ఆటో సరికొత్త
ఉత్పత్తులను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ ఇటీవలే ఓ సరికొత్త అప్‌గ్రేడెడ్ స్టయిలిష్ డిస్కవర్ 125 ఎస్‌టి మోటార్‌సైకిల్‌ను, అలాగే బజాజ్
పల్సర్ 200ఎన్ఎస్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన
సంగతి తెలిసిందే. మొత్తమ్మీద చూస్తే కొత్త బాక్సర్ బిఎమ్100
ఎంట్రీ లెవల్ టూవీలర్ మార్కెట్లో
బజాజ్ ఆటో ఎలాంటి మ్యాజిక్
చేయనుందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది.
0 comments:
Post a Comment