నంబన్
చిత్రంలో విజయ్ తో లిప్
లాక్ సన్నివేశాల్లో నటించిన ఇలియానా....బాలీవుడ్‌లో ముద్దుల డోసు
మరింత పెంచింది. అక్కడి సినిమాల్లో ముద్దు దృశ్యాలు సర్వసాధారణం కాబట్టి అక్కడి పోకడలకు తగిన విధంగా తన
ఆటిట్యూడ్ మార్చకుంటోంది ఈ గోవా సుందరి.
ప్రస్తుతం ‘బర్ఫీ' చిత్రంలో కథానాయకుడు రణభీర్‌కపూర్‌తో దీర్ఘ
అధరచుంబన దృశ్యంలో నటించింది. ప్రధాన హీరోయిన్‌గా చేస్తున్న ప్రియాంక
చోప్రా డీగ్లామరైజ్డ్ రోల్ చేస్తుండటంతో ప్రోమోస్‌లో ఇలియాన ప్రత్యేకార్షణగా
నిలిస్తోంది.
వెండితెరపై
తన తొలిముద్దు అనుభవం గురించి ఇలియానా మాట్లాడుతూ ‘లిప్‌లాక్ సీన్
అనగానే మొదట కొంచెం కంగారు
అనిపించింది. అయితే దర్శకుడు అనురాగ్‌బసు సందర్భం గురించి
చెప్పినప్పుడు అందులో రొమాంటిక్ ఫీల్ కంటే ఇద్దరు
ప్రేమికుల మధ్య భావోద్వేగాల వ్యక్తీకరణ
ప్రధానంగా వుందనిపించింది.
అందుకే
రణభీర్‌తో లిప్‌లాక్
సన్నివేశాన్ని రొమాంటిక్ కోణంలోనే కాకుండా ప్రేమికుల అనుబంధంలోని గాఢతను తెలియజెప్పే వ్యక్తీకరణగానే భావించాను. సినిమా చూసిన ప్రేక్షకులు కూడా
అదే కోణంలో ఆలోచిస్తారు' అని ముద్దు ముచ్చట్లను
వివరించింది ఇలియానా.
ఇలియానా
ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ తో
కలిసి జులాయి, రవితేజతో కలిసి దేవుడు చేసిన
మనుషులు చిత్రాల్లో నటించింది. ఈ రెండు చిత్రాలు
ఇదే నెలలో విడుదల కాబోతున్నాయి.
చాలా కాలంగా సరైన హిట్ లేని
ఇలియానా ఈ చిత్రాపై బారెడు
ఆశలు పెట్టుకుంది.
0 comments:
Post a Comment