ఆలివ్
నూనె - ఈ నూనెతో చేసే
వంటకాలు ఎంతో ఆరోగ్యం. మంచి
కొలెస్టరాల్ పెంచుతాయి. కడుపు నింపి అధిక
ఆకలి కాకుండా చేస్తాయి.ఆపిల్స్ - ఆపిల్స్ లో కేలరీలు తక్కువ.
పీచు అధికం. తిన్నది బాగా జీర్ణం చేస్తుంది.
దీనిలోని పెక్టిన్ మీకు కడుపు నిండినట్లు
భావించేలా చేస్తుంది.
టమాటాలు
- విటమిన్ సి టమాటాలలో అధికం.
యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కేలరీలు
తక్కువ. సూప్, సలాడ్, పప్పు
లేదా పండుగా కూడా తినేయవచ్చు. కేన్సర్,
గుండెజబ్బులను నివారిస్తాయి. చర్మం మెరిసేలా చేస్తాయి.
కొబ్బరి
- కొబ్బరి కడుపు నింపుతుంది. ఆరోగ్యకర
కొవ్వును ఇస్తుంది. పోషకాలు అధికం.
నిమ్మకాయ
- దీనిలో విటమిన్ సి అధికం. మీ
జీవప్రక్రియ పెంచుతుంది. స్లిమ్ గా ఉంచుతుంది. ఎసిడిటీ
తగ్గించి మొండి రోగాలను దూరం
చేస్తుంది.
గ్రీన్
టీ - గ్రీన్ టీ లో యాంటీ
ఆక్సిడెంట్లు అధికం. కొవ్వును కరిగించి మెటబాలిజం అధికం చేస్తుంది. రోజూ
ఒకటి లేదా రెండు కప్పులు
తాగితే చెడు కొల్లెస్టరాల్ స్ధాయిలు
తగ్గిస్తుంది.
వాల్
నట్స్ - దీనిని బ్రెయిన్ ఫుడ్ అంటారు. దీనిలో
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఆరోగ్యకరమైన చిరుతిండి. కడుపు నింపుతుంది.
మొలకెత్తిన
విత్తనాలు - పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు,
అలచందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో
మంచిది. వీటిని శక్తి గుళికలు అంటారు.
కడుపు నింపుతాయి. శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు, విటమిన్లు
సమకూరుతాయి.
ద్రాక్ష
- ప్రతిరోజు కొద్దిగా తింటే చాలు వీటిలో
కావలసినంత ఫైబర్, నీరు ఉండి కడుపు
నింపేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికం
వయసు కనపడనీయకుండా చేస్తాయి.
పెరుగు
- పెరుగులో మంచి కాల్షియం, ప్రొటీన్లు
ఉంటాయి. కొవ్వు కరిగిస్తుంది. మేలు చేసే బాక్టీరియా
మీ జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది.
ఆకు కూరలు - కేలరీలు తక్కువ, పీచు ఎక్కువ, గ్లైసీమిక్
ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు
కూడా తినవచ్చు. కడుపు నింపుతాయి. రక్తాన్ని
శుభ్ర పరుస్తాయి.
కేరట్లు
- కార్బో హైడ్రేట్లు అధికంగా ఉండి త్వరగా ఆకలినిస్తాయి.
పీచు, విటమిన్ ఎ మరియు బి
కాంప్లెక్స్ అధికం. ఇవి సాఫీగా విరోచనం
చేస్తాయి.
అరటి
పండ్లు - నీటి శాతం అధికం.
పీచు ఉంటుంది. కడుపు నింపుతాయి. మలబద్ధకాన్ని
నివారిస్తాయి. మూడ్ మంచిగా ఉండేలా
చేస్తాయి.
కివి
పండ్లు - కడుపు నింపుతాయి. పీచు
అధికం. కేలరీలు తక్కువ, గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ.
ఓట్లు
- ఆరోగ్యకర చిరుతిండి. పీచు అధికం, కడుపు
నింపుతాయి. పోషకాలు వంటికి పట్టేలా చేస్తాయి.
చిలకడ
దుంప - గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువ కనుక డయాబెటిక్ రోగులు
కూడా తినవచ్చు. పీచు బాగా ఉండి
ఆకలి తీరుస్తుంది.
గోంగూర
- గోంగూరలో పీచు, ఐరన్, ఫోలేట్
పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు గోంగూర
లో 35 కేలరీలు ఉంటాయి. పప్పులు, పులుసు, సలాడ్ అన్ని చేసుకోవచ్చు.
బీట్
రూట్ - పీచు అధికం, ఆరోగ్యకర
షుగర్ వుండి ఆకలి తీరుస్తుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది.
అవిసె
గింజలు - వీటిని సలాడ్లపై చల్లుకు తినవచ్చు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. కొల్లెస్టరాల్ అదుపులో ఉంచి జీర్ణక్రియ పెంచుతాయి.
రేగుపండు
- వీటిలో పెక్టిన్ ఫైబర్ ఉంటుంది బ్లడ్
షుగర్ తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు సహకరిస్తాయి.
కొవ్వు కణాలను లిమిట్ చేస్తాయి.
చేపలు
- చేపలను గుండె ఆహారంగా చెపుతారు.
వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండి ఎంతో మేలు
చేస్తాయి. కొవ్వు కరిగిస్తాయి.
ఆరెంజస్
- విటమిన్ సి బాగా ఉంటుంది.
వింటర్ జలుబులు అరికడతాయి. తక్కువ కేలరీలు. తీపి కోరిక తగ్గిస్తాయి.
బ్రక్కోలి
- బ్రక్కోలిలో విటమిన్ ఎ మరియు సి
మరియు కాల్షియం కూడా ఉంటాయి. వీటితో
సూప్ సలాడ్ వంటివి చేసుకోవచ్చు.
కేలరీలు తక్కువ.
గుడ్లు
- ప్రొటీన్లు అధికం. ఎమినో యాసిడ్లు బరువు
తగ్గించేస్తాయి. బ్లడ్ షుగర్ స్ధిరీకరించబడుతుంది.
ఊబకాయం ఏర్పడకుండా చేస్తాయి.
కాటేజ్
ఛీజ్ - ప్రొటీన్లు అధికం. కాల్షియం బాగా ఉంటుంది. ఈ
కాల్షియం కొవ్వును కరిగించి మీరు స్లిమ్ గా
ఉండేలా చేస్తుంది.
ఈ రకమైన ఆహారాలు తింటూ
ప్రతిరోజూ ఒక గంట వ్యాయామం
చేస్తూంటే, మీ ఆరోగ్యం అద్భుతంగా
ఉంటుంది అంటారు ఎంతో అనుభవంకల పోషకాహార
నిపుణులు మైధిలి మరియు సుశీల.
0 comments:
Post a Comment