నారా రోహిత్
హీరోగా వల్లభనేని రోశయ్య సమర్పణలో వెంకటసూర్యతేజ ప్రొడక్షన్స్ పతాకంపై ‘ప్రస్థానం'
నిర్మాత రవి వల్లభనేని నిర్మిస్తున్న చిత్రం ‘మద్రాసి'. విజయ్ లింగమనేనిని దర్శకునిగా
పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల అవధాన సరస్వతిపీఠంలో
ఈ చిత్రం ఆరంభమైంది.
ఈ రోజు(జూలై 25) నారా
రోహిత్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ చిత్రం ఫస్ట్
లుక్ పోస్టర్ విడుదల చేశారు. మాస్ యాక్షన్ డ్రామా
నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రంలో హీరోయిన్ ఇంకా ఖరారు కావాల్సి
ఉంది. గతంలో బాణం, సోలో
చిత్రాల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న రోహిత్ ఈ చిత్రంతో సరికొత్త
యాంగిల్ లో ట్రై చేస్తున్నాడు.
ఈ చిత్రానికి సంగీతం: రాధన్, కెమెరా: అరవిందన్ పి. గాంధీ.
మరో వైపు నారా రోహిత్
హీరోగా గులాబీ మూవీస్ పై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'ఒక్కడినే'లో చేస్తున్నారు. నిత్యామీనన్
హీరోయిన్ గా చేస్తున్న ఈ
చిత్రంలో కథ...సూర్య అనే
యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ
మధ్య సాగే ప్రేమ..వాటి
మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది.
నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి
అనుబంధాల్ని టచ్ చేస్తూ నిర్మిస్తున్న
కుటుంబ కథా చిత్రమిది.
టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడి తమ్ముడి కొడుకైన రోహిత్ తన రాజకీయ కుటుంబ
నేపథ్యానికి భిన్నంగా సినిమా రంగాన్ని ఎంచుకున్నారు. నందమూరి కుటుంబంతో బంధుత్వం ఉండటం కూడా ఆయన
ఇటు వైపు రావడానికి మరో
కారణం అయి ఉండొచ్చు. ఏది
ఏమైనా రోహిత్ మంచి టాలెంట్, భవిష్యత్
ఉన్న హీరో. అతను ఇలాంటి
పుట్టిన రోజులు మరిన్నో జరుపుకుంటూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుదాం.
0 comments:
Post a Comment