నెల్లూరు:
సోమవారం తెల్లవారుజామున న్యూఢిల్లీ- చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో
ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది.
నెల్లూరు రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన కొద్ది
సేపట్లోనే రైల్లోని ఎస్-11 బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ
ఘటనలో 32 మంది ప్రయాణికులు మృతి
చెందినట్లు తెలుస్తున్నది. మరి కొంత మంది
తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే
అవకాశం ఉంది.
సమాచారం
తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది
ఘటన స్థలానికి చేరుకుని కొంత వరకు మంటలను
అదుపుచేశారు. బోగీలో అగ్నికి ఆహుతైన ప్రయాణికులను బయటికి తీశారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.
గ్యాస్ కట్టర్ సహాయంతో మంటలు వ్యాపించిన బోగీని
రైలు నుంచి వేరు చేశారు.
ఈ రైలు ప్రమాదంతో పలు
రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం తెలుసుకున్న ఎస్పీ, జిల్లా కలెక్టర్ శ్రీధర్ ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుని
సహయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
రాష్టానికి
చెందిన విజయవాడ 27 మంది, వరంగల్‌లో
ఏడుగురు ఈ రైలులో ఎక్కారు.
దీంతో మృతుల్లో రాష్ట్రానికి చెందినవారు కూడా ఉండే ప్రమాదం
ఉందని అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను
వెలికి తీశారు. సంఘటనా స్థలానికి సహాయక బృందాలు చేరుకున్నాయి.
ఎస్
- 11 స్లీపర్ కోచ్ పూర్తిగా దగ్దమైనట్లు
తెలుస్తోంది. ఇందులో 72 మంది ప్రయాణికులున్నట్లు చెబుతున్నారు. ఈ
ప్రమాదం సోమవారం తెల్లవారు జామున 4 గంటల 28 నిమిషాల ప్రాంతంలో జరిగింది. రైలు టాయిలెట్ వద్ద
షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం
జరిగి ఉండవచ్చునని నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీధర్ అంటున్నారు.
హెల్ప్
లైన్స్
సికింద్రాబాద్:
040 - 27786723
చెన్నై:
2535738
నెల్లూరు:
0861-2345863, 2345864, 2345865, 234866
విజయవాడ:
0866 - 2576924, 2575038
0 comments:
Post a Comment