విజయవాడ:
రాష్ట్రంలోని నెల్లూరు వద్ద ప్రమాదానికి గురైన
తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులోని
ఎస్ - 11 బోగీలో మొత్తం 72 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఢిల్లీలో 17 మంది, భోపాల్‌లో
11 మంది, ఆగ్రాలో ముగ్గురు, నాగపూర్‌లో ఒకరు, ఝాన్సీలో
ఆరుగురు, వరంగల్‌లో ఏడుగురు, విజయవాడలో
28 మంది ప్రయాణికులు ఈ బోగీలో ఎక్కారు.
ప్రమాదంలో ఎస్ - 11 బోగీ పూర్తిగా దగ్ధమైన
విషయం తెలిసిందే.
విజయవాడలో
ఎక్కిన ప్రయాణికుల వివరాలు - ఉదయభాను (30), సాయికుమార్ (26), తిరుపతి (15), శ్రీరాం (25), సాయికుమార్ (28), మదన్‌లాల్ (48), అనూష్
(23), రుషి వర్ది (27), ఉత్తర కుమార్ (34), సంపత్
(23), వర్మ (22), జస్వని (23), శ్రీకర్ (22), రాజేశ్వర్ (28), దీపిక (22), రాజు (27), పల్లవి (25), ప్రశాంతి (23), సింధు (22), దీపక్ (33), సుధాకర్ (46), జ్ఝానేశ్వర్ (25), సునీత (25), విజయ్ కుమార్ (23), వెంకటరమణ
(30), మొహిద్దీన్ (40), అభినవ్ బద్రా (24), నాగరాజు (45), కాశీనాథ్ (28)
వరంగల్
స్టేషన్‌లో ఎక్కిన ఏడుగురు
ప్రయాణికులు - షాలిని (23), ప్రశాంతి (23), చందు (22), విజయ్ కుమార్ (23), అవినాష్
(24), రాజు (27), శ్రీనివాస్ (25).
ప్రమాదానికి
గురైన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు
చెన్నైకి బయలుదేరింది. ప్రమాదానికి గురైన ఎస్ -11 సహా
మరో నాలుగు బోగీలను రైల్వే అధికారులు నెల్లూరులోనే నిలిపేశారు. మిగిలిన బోగీలతో రైలు నెల్లూరు నుంచి
చెన్నైకి బయలుదేరింది. రైలు దుర్ఘటనపై పూర్తి
స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ సహాయ మంత్రి
మునియప్ప చెప్పారు. ఆయన సోమవారం సాయంత్రం
3 గంటలకు సంఘటనా స్థలానికి వస్తున్నారు.
గాయపడినవారిలో
నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రిలో ఐదుగురు, జయభారత్ ఆస్పత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
0 comments:
Post a Comment