హాట్
హీరోయిన్స్ బికినీ అందాలతో హారర్ నేపథ్యంలో రూపొంది
హిట్టయిన తమిళ చిత్రాన్ని తెలుగులో
‘ఆరోజు' పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఏం జరిగింది' అనేది
సబ్ టైటిల్. సదా, స్నేహా ఉల్లాల్,
రియా సేన్, దేశ్ ముఖ్
ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రముఖ
ఛాయాగ్రాహకుడు, దర్శకుడు సంతోష్ శివన్ సోదరుడు సంగీత్
శివన్ దర్శకత్వం వహించారు.
నివేద
స్టూడియో ఫిలిం కంపెనీ సమర్పణలో
నిర్మాత అడ్డాల వెంకట్రావు, ఎ.సెల్వం సంయుక్తంగా
తెలుగులో ఈచిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం
డబ్బింగ్ మరియు రి రికార్డింగ్
కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు
అడ్డాల వెంకట్రావు, సెల్వం మాట్లాడుతూ ‘ఓ వినూత్నమైన కథాంశంతో
రూపొందిన చిత్రమని తెలిపారు.
తమిళ
ప్రేక్షకుల్నిఅమితంగా ఆకట్టుకున్న ఈ గ్లామర్ ఓరియెంటెడ్
హారర్ చిత్రం మన తెలుగు ప్రేక్షకుల్ని
కూడా విశేషంగా అలరిస్తుందనే నమ్మకం మాకుంది. సదా, స్నేహ ఉల్లాల్,
రియా సేన్ల గ్లామర్,
కథాంశంలోని నవ్యత, ముఖ్యంగా హార్రర్, సంగీత్ ఫోటోగ్రఫీ మరియు డైరెక్షన్ ఈ
చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు. త్వరలోనే ఫస్ట్ కాపీ సిద్ధం
అవుతుంది' అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: శర్మ, పాటలు: పొందూరి,
యం.రామారావు, మాటలు: అడ్డాల వెంకట్రావు, ఎడిటింగ్: ఎల్. రామారావు, కో-ప్రొడ్యూసర్: అరుణ్, నిర్మాతలు: అడ్డాల వెంకట్రావ్, సెల్వం, ఛాయాగ్రహణం-చిత్రానువాదం-దర్శకత్వం: సంగీత్ శివన్.
0 comments:
Post a Comment