టాలీవుడ్
నవ్వుల డాన్ బ్రహ్మానందం ‘గజదొంగ'గా ప్రేక్షకులను అలరించడానికి
రాబోతున్నాడు. భవాని మూవీస్ బ్యానర్
పై యు.శ్రీనివాసరావు నిర్మిస్తున్న
ఈ చిత్రంలో బ్రహ్మీ టైటిల్ రోల్ చేస్తుండగా... చైతన్య,
ప్రకృతి జంటగా నటిస్తున్నారు. ఈ
చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది . ఆర్ ఎస్ సురేష్
దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వైజాగ్
సత్యనారాయణ క్లాప్ ఇవ్వగా, మరుధూరి రాజా కెమెరా స్విచ్
ఆన్ చేసారు, సురేష్ దర్శకత్వంలో తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు
.
దర్శకుడు
సురేష్ మాట్లాడుతూ...దర్శకుడిగా నాకిది మొదటి చిత్రం. ఈ
చిత్రంలో బ్రహ్మానందం కీ రోల్ పోషిస్తున్నారు.
కామెడి నేపధ్యంలో ఈ చిత్రం ఉంటుంది.ఈ నెల 23 నుంచి
రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది . 3 షెడ్యుల్లో సినిమాని పూర్తిచేస్తాము అని అన్నారు .
నిర్మాత
మాట్లాడుతూ..బ్రహ్మానందం, అలీ, ఎం.ఎస్
నారాయణ వంటి ఆర్టిస్టులతో ఓ
కామెడి సినిమా చేయాలనేది నా కోరిక , ఆ
కోరికను ఈ గజదొంగ చిత్రం
ద్వారా తీర్చుకుంటునాను. గజదొంగ గా బ్రహ్మానందం నటిస్తున్నారు.
ఆయన చుట్టూ ఈ కధ తిరుగుతుంది
. మా ఈ సినిమాని ఆదరిస్తారని
ఆశిస్తున్నాను అని అన్నారు .
బ్రహ్మానందం,
చైతన్య, ప్రకృతి , జీవా, ధనరాజ్ , రఘుబాబు
, అలీ, కొండవలస, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న
ఈ చిత్రానికి కధ : శ్రీనివాస్ డి
, మాటలు:మరుధూరి రాజా, కెమెరా: రాహుల్
, ఎడిటింగ్: ఉపేంద్ర , నిర్మాత: యు శ్రీనివాస్, స్క్రీన్
ప్లే - దర్శకత్వం : ఆర్ ఎస్ సురేష్.
మరో వైపు బ్రహ్మీ వెన్నెల
కిషోర్ దర్శకత్వంలో జఫ్ఫా చిత్రం చేస్తున్న
సంగతి తెలిసిందే. బ్రహ్మానందం కామెడీకి మంచి డిమాండ్ ఉండటంతో
పలువురు దర్శక నిర్మాతలు ఆయన్నే
లీడ్ గా పెట్టి పలు
సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.
0 comments:
Post a Comment