ప్రముఖ ఆటోమొబైల్
కంపెనీ టాటా మోటార్స్ నీటితో నడిచే కార్లను (హైడ్రోజన్ పవర్డ్ కార్స్) అభివృద్ధి చేస్తున్న
సంగతి తెలిసిందే. అయితే, ఇంతలోనే పాకిస్థాన్‌కు చెందిన ఇంజనీర్ నీటితో నడిచే కారును
తయారు చేసి అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇస్లామాబాద్‌కు చెందిన వాక్వర్ అహ్మద్
నీటిని ఇంధనంగా చేసుకొని నడిచే కారును తయారు చేశాడు.
పాకిస్థాన్
రాజధానిలో జరిగిన ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థుల సమక్షంలో జరిగిన ఓ ప్రదర్శనలో అహ్మద్
నీటితో నడిచే కారును ప్రదర్శించినట్లు
డాన్ పత్రిక పేర్కొంది. పెట్రోల్ లేదా సిఎన్‌జికి
బదులుగా కేవలం నీటిని ఉపయోగించి
ఈ కారును నడపవచ్చని అహ్మద్ తెలిపాడు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన
వారంతా వాక్వర్ అహ్మద్ ప్రాజెక్ట్‌ను చూసి ఆశ్చర్యానికి
గురయ్యారు.
అంతేకాకుండా,
ఈ 'వాటర్ ఫ్యూయెల్ కిట్
ప్రాజెక్ట్'ను క్యాబినెట్ సబ్-కమిటీ ప్రశంసించింది. క్యాబినెట్
మంత్రి సయ్యద్ కుర్షిద్ అహ్మద్ షా ఈ ప్రాజెక్టుకు
గాను వాక్వర్ అహ్మద్‌తు తమ పూర్తి
మద్దతు కల్పిస్తామని పేర్కొన్నారు. నీటి ఆవిరి కాన్సెప్ట్‌తో ఈ కారు
పనిచేస్తుంది. డిస్టల్డ్ వాటర్ ద్వారా ఉత్పన్నమయ్యే
హైడ్రోజన్ గ్యాస్‌తో ఈ కారు
నడుస్తుంది.
ఈ ప్రాజెక్ట్ డెమోనిస్ట్రేషన్ సమయంలో సయ్యద్ కుర్షిద్ అహ్మద్ షా ఈ వాటర్
కారును స్వయాన నడిపారు. అహ్మద్‌కు పూర్తి భద్రతను
కల్పిస్తామని, అతని ఫార్ములాను రహస్యంగా
ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ
ప్రాజెక్టుకు ప్రధానమంత్రి రాజా పర్వేజ్ ఆష్రాఫ్,
ఆర్థిక మంత్రి హఫీజ్ షేక్‌లు
విలువనిస్తారని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment