న్యూఢిల్లీ:
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)కి స్వయం ప్రతిపత్తి
ఉండేలా చూడాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ-2 నిందితుడు విజయ
సాయి రెడ్డి బుధవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ
పిటిషన్ స్వీకరించిన హైకోర్టు దానిపై ఆయన వాదనలు విన్నది.
అనంతరం విచారణనను వచ్చే బుధవారానికి వాయిదా
వేసింది.
కేంద్ర
ప్రభుత్వానికి, సిబిఐకి, సివిసికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విజయ
సాయి రెడ్డి పిటిషన్ పైన కౌంటర్ దాఖలు
చేయాలని వారిని ఆదేశించింది. వారం లోగా వివరణ
ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. సిబిఐకి
స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని, సిబిఐ సివిసి నియంత్రణలో
ఉండేలా చూడాలని, కేంద్ర ప్రభుత్వం నియంత్రణలో ఉండటం వల్ల సిబిఐ
స్వేచ్ఛగా ఉండే అవకాశం లేదని
తన పిటిషన్‌లో సాయి రెడ్డి
పేర్కొన్నారు.
గతంలోనూ
విజయ సాయి రెడ్డి ఇదే
అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు
హైకోర్టు ఆయన పిటిషన్‌ను
తిరస్కరించింది. ఈ అంశాన్ని సుప్రీం
కోర్టులో తేల్చాలని ఆయనకు సూచించింది. దీంతో
విజయ సాయి రెడ్డి మళ్లీ
తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాగా
సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జగన్ అక్రమాస్తుల కేసు
జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ
కేసులో జగన్ ఏ-1 నిందితుడు
కాగా, విజయ సాయి రెడ్డి
ఏ-2గా ఉన్నారు.
0 comments:
Post a Comment