హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల
కేసును విచారిస్తున్న సిబిఐ జాయింట్ డైరెక్టర్
లక్ష్మినారాయణ మీడియాకు లీకులు ఇచ్చిన వ్యవహారంపై ఫిర్యాదు అందినట్లు సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సివిసి) ప్రదీప్ కుమార్ తెలిపారు. దీనిపై సిబిఐ నుంచి నివేదిక
అడిగామని ఆయన చెప్పారు. సిబిఐ
నివేదిక అందిన వెంటనే ఈ
అంశాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు. సిబిఐ
జెడి లక్ష్మినారాయణ మీడియా లీకులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సివిసికి
ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
హైదరాబాదులో
జరిగిన ఏడవ విజిలెన్స్ స్టడీ
సర్కిల్ కార్యక్రమానికి ప్రదీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అవినీతి అనేది క్యాన్సర్ వంటిదని,
గత రెండేళ్లుగా అవినీతి అనే అంశంపై ప్రజల్లో
చర్చ జరుగుతూనే ఉన్నదని ఆయన అన్నారు. ప్రతిశాఖలోనూ
అవినీతి పేరుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు.
ఇటీవలి
వైయస్ విజయమ్మ ఢిల్లీ వెళ్లి తన కుమారుడు, తమ
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై
సిబిఐ జెడి లక్ష్మినారాయణ దర్యాప్తు
తీరుపై సివిసికి ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తునకు సంబంధించి
జెడి లక్ష్మినారాయణ ఒక వర్గం మీడియాకు
లీకులు ఇస్తున్నారని ఆమె సివిసికి ఫిర్యాదు
చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు కూడా
ఆమె ఈ విషయంపై ఫిర్యాదు
చేశారు.
లక్ష్మినారాయణ
కాల్ లిస్టును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మీడియాకు విడుదల చేసి దుమారం రేపింది.
లక్ష్మినారాయణ ఎవరెవరికి ఫోన్ చేశారనే విషయాన్ని
వారు ఆ కాల్ లిస్టు
ద్వారా బయటపెట్టే ప్రయత్నం చేసింది. దాని ఆధారంగానే లక్ష్మినారాయణ
ఒక వర్గం మీడియాతో కలిసి
జగన్‌పై కుట్ర చేస్తున్నారని
ఆరోపించింది.
0 comments:
Post a Comment