లీడర్ సినిమా
తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్న శేఖర్ కమ్ముల త్వరలో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్" సినిమా
ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నసంగతి తెలిసిందే. అయితే ఇదిగో అదిగో
అంటూ ఈచిత్రాన్ని ఆలస్యం చేస్తూనే వస్తున్నారు. ఎట్టకేలకు శేఖర్ కమ్ముల ఆలస్యం కావడానికి
గల కారణం వివరించారు.
ఆర్ట్
డైరెక్టర్ తోట తరణి ఈ
చిత్రంలో సిటీలోని కాలనీని తలపించే సెట్ మొత్తాన్ని వేయడానికి
చాలా సమయం పట్టింది. రూ.కోటితో ఈ సెట్ డిజైన్
చేశారు. ఆకారణంగా సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది అని
చెప్పుకొచ్చారు శేఖర్ కమ్ముల. ఈ
చిత్రం ఆరుగురు సాధారణ కుటుంబాలకు చెందిన అమ్మాయిలు, అబ్బాల మధ్య నడుస్తుంది. కాస్త
హ్యాపీడేస్ పోలికలున్న కథలా ఉంటుంది. అంతా
కొత్తవారే నటిస్తున్నారని, అభిజిత్, సుధాకర్, కౌశిక్, షాగున్, జారా, రేష్మి, కావ్య,
నవీన్, విజయ్, సంజీవ్, శ్రీరామ్ ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు
వెల్లడించారు.
ఈ చిత్రానికి మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తుండగా,
విజయ సి కుమార్ సినిమాటోగ్రఫీ
అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'
పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది
వరకు తాను దర్శకత్వం వహించిన
‘లీడర్' చిత్రం అనుకున్న అంచనాలు చేరుకోక పోవడంతో...ఈ సినిమాపై బోలెడు
ఆశలు పెట్టుకున్నాడు శేఖర్ కమ్ముల.
ఇప్పుడు
మార్కెట్లో అందరి దృష్టీ ‘లైఫ్
ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంపైనే ఉంది. తక్కువ బడ్దెట్
లో తీసే శేఖర్ కమ్ముల
సినిమాలు డిస్ట్రిబ్యూటర్స్ కీ, ఎగ్జిబిటిర్స్ కి
రెగ్యులర్ గా ఎక్కువ లాభాలు
తెచ్చిపెడుతూండటంతో ఈ చిత్రం రైట్స్
కోసం మంచి పోటీ ఏర్పడినట్లు
సమాచారం. ముఖ్యంగా ఓవర్ సీస్ నుంచి
మంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సిటీల్లోనూ ఎగ్జిబిటర్స్
కూడా ఈ చిత్రం విడుదలపై
ఆసక్తి చూపెడుతున్నారు.
0 comments:
Post a Comment