బరువు
తగ్గాలంటూ ఎంతో కష్టపడతారు. ప్రతిరోజూ
వ్యాయామం, డైటింగ్ వంటివి చేస్తూనే ఉంటారు. కాని బరువు తగ్గటంలో
ఫలితాలు తక్కువగానే ఉంటూ ఉంటాయి. కాని
కొన్ని సార్లు వారికి తెలియకుండానే కొన్ని తప్పులు జరిగిపోతూంటాయి. సాధారణంగా ఎంత డైటింగ్ లో
ఉన్నప్పటికి,కొన్నిసార్లు తెలిసో తెలియకో డైటింగ్ చేసేవారు డైట్ కోక్స్ లేదా
ఇతర కార్బోనేటెడ్ డైట్ డ్రింక్ లు
తాగుతూంటారు. అయితే ఇవి ఆరోగ్యకరం
కాదు. వీటిలో అధికంగా షుగర్ మరియు కేలరీలు
వుండి కొంతకాలంపాటు బరువు తగ్గించినప్పటికి తర్వాతి
కాలంలో అనేక ఆరోగ్య సమస్యలనిస్తాయి.
కనుక సహజంగా బరువు తగ్గి ఆరోగ్యంగా
వుండాలనుకునేవారికి ఇంటిలోనే తయారు చేసుకొని తాగదగిన
పానీయాలు కొన్ని పరిశీలించండి.
వేడినీరు
- తేనె: ఉదయంవేళ పొట్ట ఖాళీగా వున్న
సమయంలో వేడి నీరు, తేనెల
మిశ్రమం శరీరానికి ఎంతో లాభం చేకూరుస్తుంది.
బరువు తగ్గించటమేకాదు, ఈ డ్రింక్ మంచి
చురుకుదనాన్నిచ్చి మీ జీవప్రక్రియను వేగిరపరుస్తుంది.
తేనెలో వుండే అమినో యాసిడ్లు,
ప్రొటీన్లు, మినరల్స్ అధిక బరువు రాకుండా
నిలుపు చేస్తాయి.
వేడి
నీరు - నిమ్మరసం : సాధారణంగా డైటింగ్ చేసేవారు ఈ పానీయాన్ని తాగుతూనే
వుంటారు. వేడినీరు శరీరానికి మంచిది. బరువు తగ్గిస్తుంది. వేడినీరు,
నిమ్మరసం కలిసిన మిశ్రమం శరీర కొవ్వును కరిగిస్తుంది.
మంచి పోషక పానీయం కూడాను.
ప్రతి భోజనం తర్వాత ఈ
పానీయాన్ని తాగితే శరీర కొవ్వు కరిగిపోతుంది.
గ్రీన్
టీ: దీనిని ఇంటిలోనే తయారు చేసుకొని వేడి
లేదా చల్లగా కూడా తాగవచ్చు. గ్రీన్
టీ బరువు తగ్గటానికి బాగా
పని చేస్తుంది. శరీరంలోని మలినాలను విసర్జించి ఆరోగ్యంగా వుంచుతుంది. జుట్టు రాలటం, చర్మం పొడిబారకుండా చేయటం
వంటివి చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం
ఏదో ఒక సమయంలో గ్రీన్
టీ తాగండి. బరువును తగ్గించటమే కాక ఆరోగ్యానికి ఎంతో
మేలు చేస్తుంది.
పచ్చి
కూరల రసం - కాకర రసం
కొవ్వు తగ్గించేందుకు బాగా పని చేస్తుంది.
షుగర్ లెవెల్ అదుపులో వుంచి శరీరంలోని మలినాలను
తొలగిస్తుంది. దీనితో పాటు బచ్చలి ఆకు
లేదా కేరట్ లేదా టొమాటో
జ్యూస్ వంటివి కూడా తాగి బరువు
తగ్గించుకోవచ్చు. కేరట్, పొట్ల, దోస, సొర వంటి
కూరలు కూడా రసం తాగేటందుకు
వాడవచ్చు. ఈ పచ్చి కూరల
రసంలోనే కొద్దిపాటి తేనె గాని లేదా
నిమ్మరసం కాని వేసి తాగితే
రుచి మారి మీకు తాగటం
కూడా తేలిక అవుతుంది.
బరువు
తగ్గాలనుకునేవారు ఇంటిలోనే ఈ పానీయాలను తయారు
చేసుకొని తాగితే మంచి ఫలితాలు వస్తాయి.
0 comments:
Post a Comment