హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాను జన నేతగా
అంగీకరించనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా
రెడ్డి గురువారం అన్నారు. సిఎల్పీ కార్యాలయంలో జానా రెడ్డి మాజీ
మంత్రులు జెసి దివాకర్ రెడ్డి,
రాంరెడ్డి దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డితో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా వారి
మధ్య తెలంగాణ, జగన్ అంశాలు చర్చకు
వచ్చాయి.
ఈ సందర్భంగా జానా మాట్లాడుతూ... ప్రజా
సమస్యల పైన జగన్ ఏనాడైనా
పోరాడారా అని ప్రశ్నించారు. అలాంటి
వ్యక్తిని జననేతగా అంగీకరించనని చెప్పారు. వీరప్పన్‌ను కూడా కొందరు
అభిమానించారని గుర్తు చేశారు. తెలంగాణపై అధిష్టానం రాష్ట్రపతి ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వచ్చాయని, మరి సంప్రదింపులు ఇప్పటి
వరకు జరపలేదని జానారెడ్డి అన్నారు.
'జగన్
పార్టీ ముసుగు తొలగిందని, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని
తేలిపోయిందని, ఇక, కాంగ్రెస్‌లో
కలిసిపోవడం తథ్యమని తెలుగుదేశం, తెరాస, సిపిఐ వేర్వేరుగా మండిపడ్డాయి.
జగన్‌పై కాంగ్రెస్ కుట్ర
చేసిందంటూ ఉప ఎన్నికల్లో ప్రచారం
చేశారని, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో అదే కాంగ్రెస్ అభ్యర్థికి
ఎలా మద్దతు ఇచ్చారని, ఆ రెండూ తోడు
దొంగలేనని తేలిపోయిందని, వైయస్సార్ కాంగ్రెసు ఇన్నాళ్లూ అబద్ధాలు చెప్పి ప్రజలకు నమ్మకద్రోహం చేసిందని టిడిపి నేతలు కడియం శ్రీహరి,
గాలి ముద్దుకృష్ణమ నాయుడు, మహేందర్ రెడ్డి, వర్ల రామయ్య, నారాయణ
రెడ్డి అన్నారు.
జగన్‌పై కేసులకు, కాంగ్రెస్‌కు సంబంధం లేదని
మైసూరా రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారన్నారు. అంటే గతంలో ప్రజలకు
వాళ్ళు చెప్పిన మాటలు అవాస్తవాలా? ఒకవేళ
ఇప్పుడు చెబుతున్న మాటలే నిజమైతే జగన్,
విజయమ్మ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకరినొకరు రక్షించుకునే యత్నాల్లో భాగంగానే కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు మధ్య డీల్ కుదిరిందని,
అందుకు రాష్ట్రపతి ఎన్నికలే ఉదాహరణ అని స్పష్టం చేశారు.
చిన్న
పార్టీలను నయానో, భయానో తమలో కలిపేసుకోవడం
కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన
విద్య అని... త్వరలో జగన్ పార్టీ, ఆ
తర్వాత టిఆర్ఎస్‌ను కూడా కలుపుకొంటారని
వ్యాఖ్యానించారు. అక్రమాస్తుల కేసులో ఈడి విచారణ ప్రారంభం
కావడంతో... జగన్ మీడియా, అక్రమాస్తులను
స్వాధీనం చేసుకుంటారన్న భయంతోనే కాంగ్రెస్‌కు వైయస్సార్ కాంగ్రెసు
దాసోహమైందని పేర్కొన్నారు.
కాంగ్రెస్
పార్టీకి వ్యతిరేకంగా పుట్టామని చెప్పుకొనే జగన్ పార్టీ, స్వార్థం-రాజకీయ లబ్ధి కోసమే ప్రణబ్
ముఖర్జీకి ఓటేసినట్లుగా తాము భావిస్తున్నామని టిఆర్ఎస్
పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్
చంద్రశేఖర్ చెప్పారు. ప్రణబ్‌కు ఓటు- జగన్‌కు బెయిల్ ప్రచారం
నిజం కాకపోతే.. వైయస్సార్ కాంగ్రెసు నిజాయితీ నిరూపించుకోవాలంటే.. జగన్‌ను ఏడాదిపాటు
వదలకుండా జైలులోనే ఉంచాలని కోరాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి
ఎన్నికలపై టిడిపి నిర్ణయం హర్షనీయమని అన్నారు. తెలంగాణ రాకపోవటానికి ప్రణబ్ ముఖ్య కారణమని, అప్పట్లో
ఆయన.. కమిటీ వేసి, తప్పక
తెలంగాణ ఇస్తానని చెప్పారన్నారు. కానీ, నాలుగైదేళ్ల కాలంలో
కమిటీ సమావేశాలను ఒక్కసారి కూడా నిర్వహించలేదని విమర్శించారు.
0 comments:
Post a Comment