హైదరాబాద్:
ఈ-టీవీ చానళ్ళ అమ్మకాలకు
సంబంధించి ఈనాడు గ్రూపు సంస్థల
అధిపతి రామోజీరావు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య జరిగిన 2,604 కోట్ల
రూపాయల లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్ (ఈడి) దర్యాప్తు ప్రారంభించినట్లు
బుధవారం వార్తలు వచ్చాయి. రామోజీరావు, రిలయన్స్ సంస్థల మధ్య జరిగిన వ్యాపార
వ్యవహారాల్లో మనీ ల్యాండరింగ్, ఇతర
ఆర్థికపరమైన అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చేసిన ఫిర్యాదుకు కేంద్ర
ఆర్థిక శాఖ సహాయమంత్రి ఎస్‌ఎస్ పళని మాణిక్యం
స్పందించారు. ‘వ్యవహారాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్
డైరెక్టరేట్ పరిశీలిస్తోంది. రిజర్వు బ్యాంకు నుంచి అవసరమైన సమాచారాన్ని
తెప్పించుకుంది. కేసులో దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే
ఉంది' అని ఆయన చెప్పారు.
ఈ వ్యవహారంపై సిబిఐ, ఇడిలతో విచారణ జరిపించాలని కోరుతూ గతంలో ఎంపీ అరుణకుమార్
కేంద్ర ఆర్థిక మంత్రికి ఫిర్యాదు చేశారు. ఈటీవి వాటాల అమ్మకాల్లో
సైతం మనీ ల్యాండరింగ్ జరిగిందని
అరుణ్‌కుమార్ కేంద్ర మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో అన్నారు. రిలయన్స్ సంస్థ ఈటీవి చానల్స్‌ను 2604 కోట్లకు కొనుగోలు చేసింది. ఆనంతరం వీటిని టీవీ 18 కొనుగోలు చేసింది. ఈటీవి చానల్స్‌ను
కొనుగోలు చేయడానికి టీవీ 18కు రిలయన్స్ నిధులు
సమకూర్చింది. రిలయన్స్ సంస్థ ఈ నిధులను
నిమేష్ కంపానీ ద్వారా రామోజీరావుకు సమకూర్చారు. కంపానీ అనేక ఆర్థిక నేరాల
ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఓ ప్రముఖ తెలుగు
దినపత్రిక రాసింది.
మార్గదర్శి
ఫైనాన్స్ ద్వారా నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసిన కేసులో
డిపాజిట్‌దారులకు వెంటనే వారు డిపాజిట్ చేసిన
మొత్తం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పడంతో రామోజీరావుకు ఈ నిధుల అవసరం
ఏర్పడిందని, ఈ ఒప్పందాన్ని రిలయన్స్
రహస్యంగానే ఉంచిందని ఆ పత్రిక వార్తాకథనం
వ్యాఖ్యానించింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అవినీతిపై కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, రిలయన్స్‌ను కో-రెస్పాండెంట్‌గా వైయస్ విజయమ్మ
పేర్కొన్న గుర్తించాల్సి ఉంటుందని పత్రిక గుర్తు చేసింది.
ఈ - టీవికి సంబంధించి రామోజీరావుకు లైసెన్స్‌లు ఇస్తే, ఇప్పుడు
ఈటీవి చానల్స్‌ను టీవీ 18 అప్
లింకింగ్ చేస్తోందని, ఈ లైసెన్స్‌లను
రద్దు చేయాలని ఎంపి అరుణ్‌కుమార్
కేంద్ర ప్రసార శాఖ మంత్రి అంబికా
సోనీని కోరారు. రామోజీరావు హిందు అవిభక్త కుటుంబం
తరఫున నవంబర్ 2, 2007 నుంచి జనవరి 3, 2008 వరకు
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులో
డిపాజిట్ చేశారని, బిర్లా క్యాష్ ప్లాన్ మ్యూచువల్ ఫండ్‌లో, లోటస్
ఇండియా లిక్విడ్ ప్రిన్సిపల్ మ్యూచువల్ ఫండ్‌లో ఇనె్వస్ట్
చేశారని వీటిపై విచారణ జరిపించాలని అరుణ్‌కుమార్ కోరారు.
ఈ డిపాజిట్లకు సంబంధించిన డబ్బు ఎక్కడి నుంచి
వచ్చిందో రామోజీరావు వెల్లడించలేదని, ఇది కచ్చితంగా మనీ
ల్యాండరింగ్ వ్యవహారమేనని, ఇది మనీ ల్యాండరింగ్
యాక్ట్ 1982 కిందకు వస్తుందని ఎంపి అరుణ్ కుమార్
చెబుతున్నట్లు ఆ తెలుగు దినపత్రిక
రాసింది.
0 comments:
Post a Comment