హైదరాబాద్:
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ మరో మతతత్వ పార్టీగా
మారబోతోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య అనుమానం
వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీకి ధీటుగా
వైయస్సార్ కాంగ్రెసు కూడా మతాన్ని ఉపయోగించుకుని
లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. ఆ పార్టీ గౌరవ
అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఒక
పార్టీ గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉండి ఓ మత
ప్రచారకురాలిగా వ్యవహరిస్తున్నారని, కోట్లాది ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని
దుయ్యబట్టారు.
మంగళవారం
మధ్యాహ్నం ఇక్కడి టిడిపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయ
లబ్ధికోసం చూడటం వైయస్సార్ కాంగ్రెసు
పార్టీకే చెల్లిందని అన్నారు. పవిత్రమైన బైబిల్‌ను రాజకీయ సభలకు,
కార్యక్రమాలకు తీసుకురావడం దేనికి సంకేత మని ప్రశ్నించారు.
తమ ప్రయోజనాల కోసం మతాన్ని వాడుకోవటందురదృష్టకరమన్నారు.
బైబిల్‌ను రాజకీయ కోణంలో
ఉపయోగించుకోవడంపై ఆ పార్టీ సమాధానం
చెప్పాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్ల
చేనేత ధర్నా సందర్భంగా వైయస్
విజయమ్మ ఒక చేతిలో పరిశుద్ధ
గ్రంథం బైబిల్ పట్టుకొని అన్నీ పాపపు మాటలే
మాట్లాడారని తెలంగాణ రాష్ట్ర సమితి ధ్వజమెత్తింది. ఒక్క
సత్య వచనం పలకకుండా, అన్నీ
అబద్ధాలే చెప్పారని మండిపడింది. ఈమేరకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ మంగళవారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో
మాట్లాడారు.
బైబిల్
పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడిన విజయమ్మని,
ఆమె కుటుంబాన్ని ఆ దేవుడు క్షమించడన్నారు.
జరిగిన పొరపాటును అంగీకరించి ఆమె దేవుడికి, తర్వాత
తెలంగాణ ప్రజలకు విజయమ్మ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment