బాలకృష్ణ,రాజమౌళి కాంబినేషన్ లో ఓ చిత్రం
రూపొందనున్నట్లు ఫిల్మ్ నగర్ లో గత
రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య వందవ చిత్రం డైరక్ట్
చేయటానికి రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఈ మేరకు రెండు
దఫాలుగా చర్చలు జరిగాయని సమాచారం. అలాగే ఈ చిత్రాన్ని
శ్రీరామ రాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. బారీగా రూపొందే ఈ చిత్రం రాజకీయాలు
ప్రాధాన్యంగా సాగుతుందని సమాచారం.
ఇక ఈ చిత్రానికి ఎన్టీఆర్
అనే టైటిల్ ని పెట్టనున్నట్లు చెప్తున్నారు.
ట్యాగ్ లైన్ గా.. న్యాయానికి
త్యాగానికి రారాజు అని ఉంటుంది. ఇప్పటికే
ఈ టైటిల్ ని బాలకృష్ణ సొంత
నిర్మాణ సంస్ధ రామ కృష్ణ
స్టూడియోస్ పతాకంపై ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు
తెలుస్తోంది. వందవ చిత్రాన్ని తన
తండ్రిగారైన ఎన్టీఆర్ కి అంకితమిస్తూ చరిత్రలో
గుర్తుండిపోయాలా తీర్చి దిద్దాలని బాలకృష్ణ యోచిస్తున్నారు. అలాగే ఆ చిత్రంతో
తన రాజకీయ ప్రచారాన్ని ని సైతం ముడిపెట్టనున్నారని
భోగట్టా.
ప్రస్తుతం
బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ'చిత్రంలో చేస్తున్నారు. ‘‘సమాజంలో జరుగుతున్న అవినీతి, అన్యాయాలపై ఓ జర్నలిస్ట్ గావించిన
పోరాటమే ఇతివృత్తంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘శ్రీమన్నారాయణ' అని చెప్తున్నారు. ఇందులో
బాలకృష్ణ జర్నలిస్ట్‌గా కనిపిస్తారు. ఆయన
నటన ఈ సినిమాలో కొత్త
పుంతలు తొక్కుతుంది. నందమూరి అభిమానుల ఆకలి తీర్చే సినిమా
ఇది'' అని దర్శకుడు రవికుమార్
చావలి అంటున్నారు.
పార్వతీ
మెల్టన్, ఇషా చావ్లా ఇందులో
కథానాయికలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న
ఈ సినిమాను ఆగస్ట్‌లో విడుదల చేయడానికి
సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత రమేష్ పుప్పాల చెబుతున్నారు.
ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో
ఈ చిత్రం రూపొందుతోంది. ఇక మరోప్రక్క బాలకృష్ణ
గెస్ట్ పాత్రలో నటించిన ఊ కొడతారా ఉలిక్కి
పడతారా చిత్రం కూడా ఈ నెలలోనే
అంటే జూలై 27న విడుదలకు సిద్దమవుతోంది.
0 comments:
Post a Comment