రాజమౌళి
తాజా చిత్రం 'ఈగ' ఈ రోజు
అంతటా భారీ ఎత్తున విడుదల
అవుతున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రం విడుదల వాయిదా అవుతూండటం, రాజమౌళి రోజు వారి వాయిదాకు
క్లారిఫికేషన్స్ ఇవ్వటంతో కొందరిలో చాలా మందిలో ఈ
చిత్రం విజయంపై అనుమానాలు రేకిత్తించాయి. అందులోనూ ఈ చిత్రంలో హీరో
లేకుండా కేవలం గ్రాఫిక్స్ ఈగ
హీరో కావటం కూడా ఎంతవరకూ
ఈ చిత్రం విజయం సాధిస్తుందనే సందేహాలు
చాలా మంది వ్యక్తం చేసుకుంటున్నారు.
అయితే
వారి అందరి అంచనాలును తారు
మారు చేస్తూ ఈగ చిత్రం విజువల్
వండర్ గా తయారైందని, మంచి
విజయాన్ని సాధిస్తుందని ప్రీమియర్ టాక్ ద్వారా తెలుస్తోంది.
దుబాయిలోనూ, తమిళనాడు లోనూ ఈ చిత్రం
షో లు ఇప్పటికే పడ్డాయి.
అక్కడ నుంచి వచ్చిన సమాచారం
ప్రకారం గ్రాఫిక్స్ తో విజువల్ ట్రీట్
గా రూపొదింది అని, ఈగ హీరో
అన్నట్లు కాకుండా ఓ పెద్ద హీరో
చిత్రం చూస్తున్న ఫీల్ కలిగిందని చెప్తున్నారు.
దానికి కీరవాణి అందించిన టెర్రపిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ అవటం కూడా
ప్లస్ అయ్యింది.
ఇక చిత్రంలో సుదీప్ ఫెరఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్తున్నారు. అలాగే ఇంటర్వెల్ ఎపిసోడ్
లో ఈగకు,సుదీప్ కి
మధ్య వచ్చే సీన్ చాలా
ఇంటెన్షన్ తో సాగుతుందని, ఊహించలేని
విధంగా దాన్ని చిత్రీకరించాడని అంటున్నారు. అలాగే సెంకాఫ్ లో
త్రాగుబోతు రమేష్ కామిడీ హైలెట్
అవుతుంది.
కథ ప్రకారం నాని (నాని) సరదా
కుర్రాడు. తొలి చూపులోనే ఇందు
(సమంత)ని ప్రేమిస్తాడు. మరో
వైపు సుదీప్ (సుదీప్) కూడా ఇందుపై మనసుపడతాడు.
ఎలాగైనా సరే... దక్కించుకోవాలనుకొంటాడు. తనకు తెలిసిన సామదానబేధదండోపాయాలను
ప్రయోగిస్తాడు. వీటన్నింటికీ అడ్డుగా నిలుస్తున్నాడని నానిని హత్య చేస్తాడు. నాని
ఆత్మ ఓ ఈగలోకి ప్రవేశిస్తుంది.
సుదీప్ బారి నుంచి ఇందుని
ఈగ కాపాడగలిగిందా? ఆ చిరు జీవి
చేసిన పోరాటం ఫలించిందా? ఈ విషయాలన్నీ తెరపై
చూసి తెలుసుకోవలసిందే.
0 comments:
Post a Comment