‘ఈగ' చిత్రం
సంచలన విజయంతో దర్శకుడు రాజమౌళి చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ విషయమై ఆయన తన సోషల్ నెట్వర్కింగ్
బ్లాగులో స్పందిస్తూ....ఈగ చిత్రం నా కెరీర్లోనే చాలా కష్టపడి రూపొందించిన చిత్రం.
ఇంతలా నేనెప్పుడూ కష్టపడేలేదు. అందుకు తగిన ప్రతిఫలం దక్కడం నా జీవితంలో మరిచి పోలేనిది
అని చెప్పారు జక్కన్న.
ప్రముఖుల నుంచి
మీకు వస్తున్న పొగడ్తల వర్షంపై ఎలా ఫీలవుతున్నారు? అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి స్పందిస్తూ....నాకు
ఇప్పటి వరకు అలాంటి పొగడ్తలేమీ రాలేదు, కానీ ఈగ చిత్రం టాలీవుడ్ సినీ పరిశ్రమకే గర్వకారణమైన
సినిమా అంటూ అందరూ ఒకే మాట మాట్లాడుతూ ప్రశంసిస్తున్నారు. ఇది చూస్తుంటే నాకు పెద్ద
అవార్డు వచ్చే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించారు.
ఈగ చిత్రం కేవలం
తెలుగు, తమిళం భాషల్లో విడుదలైనప్పటికీ ఈ చిత్రాన్ని హిందీ, ఇతర భాషల జనాలు కూడా చూస్తుండటం
గమనార్హం. ఎందుకంటే ఈ చిత్రం చూసేవారికి బాష తెలియ పోయినా సినిమా ఏమిటో అర్థం అవుతోంది.
పైగా విజువల్స్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ రేంజిలో ఉండటం కూడా ఇందుకు ఒ కారణం. ఈ చిత్రంలో
హీరో అయిన ఈగకు అసలు డైలాగులు లేవు. దానకి ఎక్స్ ప్రెషన్స్ యాడ్ చేసి ఆశ్చర్య పరిచారు.
ఇతర భాషల జనాల తాకిడి నేపథ్యంలో యూఎస్‌లో ఈచిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో విడుదల
చేస్తున్నట్లు రాజమౌళి వెల్లడించారు.
ఈగ హిందీ వర్షన్
‘మక్కి' పేరుతో మరో ఆరు నెలల్లో రిలీజ్ కాబోతోంది. త్రీడి వెర్షన్లో దాన్ని విడుదల
చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా..ఈగ చిత్రం తెలుగు సినిమా రికార్డులను బద్దలు
కొట్టడం ఖాయం అంటున్నారు ఆ చిత్ర సమర్పకులు సురేష్ బాబు. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్లలో
ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిందని, బిజినెస్ పూర్తయ్యే లోపు తమ సినిమా టాప్‌లో
నిలవడం ఖాయం అంటున్నారు.
0 comments:
Post a Comment