బాణం,
సోలో చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న
నారా రోహిత్ త్వరలో ‘మద్రాసి'అనే చిత్రంతో ప్రేక్షకుల
ముందుకు రాబోతున్నాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందనున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ దర్శకత్వం
వహించనున్నాడు. ప్రస్థానం ఫేం రవి వల్లభనేని
నిర్మాత.
‘మద్రాసి'
మూవీ షూటింగ్ ఈ రోజు (జూలై
20) లాంఛనంగా ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని హైటెక్స్ సమీపంలో
జరిగిన ఈ కార్యక్రమానికి నిర్మాత
బెల్లంకొండ సురేష్ ముఖ్య అతిథిగా హాజరై
తొలి షాట్‌కు క్లాప్
ఇచ్చారు. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్
ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. హీరోయిన్, ఇతర వివరాలు తెలియాల్సి
ఉంది.
మరో వైపు నారా రోహిత్
ఒక్కడినే చిత్రంలో నటిస్తున్నారు. శ్రీనివాస్ రాగ దర్శకత్వం వహిస్తున్న
ఈచిత్రంలో రోహిత్ సరసన నిత్యా మీనన్
హీరోయిన్‌గా చేస్తోంది. గులాబీ
మూవీస్ పతాకంపై సి.వి.రెడ్డి
నిర్మిస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ
ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. సెలక్టెవ్‌గా సినిమాలు చేస్తూ
ముందుకు సాగుతున్న రోహిత్ అన్ని వర్గాల ప్రేక్షకులను
ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
0 comments:
Post a Comment