సమైక్యవాదులను
కాల్చేయండన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై జై ఆంధ్ర జెఏసి
నేత, మాజీ మంత్రి వసంత
నాగేశ్వర రావు ఆవేదన వ్యక్తం
చేశారు. ఆయన శనివారం విజయవాడలో
మీడియాతో మాట్లాడారు. ఆమె వ్యాఖ్యలపై సీమాంధ్ర
నేతలు కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్,
రాయపాటి సాంబశివ రావు తదితర నేతలు
వెంటనే స్పందించాలని, వారు నోరు మెదపకుండా
ఎందుకున్నారో అర్థం కావడం లేదని
ఆయన అన్నారు.
వాస్తవానికి
తెలంగాణ విషయంలో ప్రధాన పార్టీలలోనే భిన్నాప్రాయం ఉందన్నారు. కాంగ్రెస్, బిజెపి, సిబిఐ, టిడిపిలకు చెందిన తెలాంగాణ నాయకులు తమకు తెలంగాణ కావాలని
అంటున్నారన్నారు. వద్దనే దల్లా హైదరాబాద్‌లో
వ్యాపారాలు పెట్టుకున్న కొందరు పెద్దలేనని చెప్పారు. ఆంధ్రులు అమెరికాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, మనదేశంలోనే ఇతర రాష్ట్రాలలో ఉండవచ్చు
కానీ, రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో
ఉండకూడదా? ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.
కృష్ణా
డెల్టాకు నీరు ఇవ్వద్దని చెప్పడానికి
టిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎవరన్నారు. డెల్టాలో
వరి పండకపోతే అర్థికంగా ఖజానాకు కూడా ఇబ్బందేనని చెప్పారు.
వచ్చే నెల 12వ తేదీన
ఢిల్లీ వెళ్ళి ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీని, ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి
జై ఆంధ్ర ఉద్యమ డిమాండ్లను
వివరించనున్నట్టు చెప్పారు. కవిత చేసిన వ్యాఖ్యలపై
మౌనంగా ఉండటమేమిటన్నారు.
కాగా
ఐఏఎస్‌లను కాదు.. సమైక్యవాదులను
కాల్చివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం వ్యాఖ్యానించారు.
దీనిపై పలువురు మండిపడ్డారు. తెలంగాణవాదులు రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే సమైక్యవాదులు ఏం చేస్తున్నారని జైఆంధ్ర
జెఏసి ప్రశ్నించింది.
0 comments:
Post a Comment