కోల్కతా నుంచి మొట్టమొదటిగా
4జీ సేవలను ప్రారంభించిన భారతి ఎయిర్టెల్
తరువాతి టార్గెట్గా బెంగుళూరును ఎంచుకుంది.
మరో 30 రోజుల్లో కర్ణాటకలోనూ 4జీ సేవలను ప్రారంభించేందుకు
ఎయిర్టెల్ సన్నాహాలు పూర్తి
చేస్తుంది. దింతో ఐటీ హబ్గా గుర్తింపు తెచ్చుకున్న
బెంగుళూరు నగరానికి నెల రోజుల్లో కొత్త
శోభ రానుంది. భారతి ఎయిర్టెల్
కోల్కతా, కర్ణాటకలతో పాటు
పంజాబ్, మహారాష్ట్ర, సర్కిళ్లలో
బిడబ్ల్యుఏ స్పెక్ట్రమ్ లైసెన్స్లను దక్కించుకున్న విషయం
తెలిసిందే. ఇందుకుగాను రూ.38543 కోట్లను 2010లో నిర్వహించిన వేలంపాటలో
ప్రభుత్వానికి చెల్లిచింది.
3జీ స్పీడ్తో పోలిస్తే 4జీ
స్పీడ్ 10 రెట్లు అధికంగా ఉంటుంది. ప్రస్తుతానికి 3జీ నెట్వర్క్
స్పీడ్ 21 ఎంబీపీఎస్గా ఉంటే రానున్న
4జీ నెట్వర్క్ స్పీడ్
100 ఎంబీపీఎస్ పై మాటే. ఈ
వేగవంతమైన టెక్నాలజీ ధర కాస్త అధికంగానే
ఉంటుంది. 4జీ సర్వీసులను అందించే
రేసులో రిలయన్స్ ఇన్ఫోటెల్, బీఎస్ఎన్ఎల్, టికోనా, ఎయిర్సెల్, క్వాల్కమ్,
ఎమ్ టీఎన్ఎల్ వంటి ప్రముక టెలికాం
సంస్థలు ఉన్నాయి. అయితే వీటి సేవలు
జూలై నుంచి అందుబాటులోకి రానున్నాయి.
ఇండియన్
మార్కెట్లో లభ్యమవుతున్న 4జీ స్మార్ట్ఫోన్ల జాబితా:
ఇండియన్
మార్కెట్లో లభ్యమవుతున్న 4జీ స్మార్ట్ఫోన్ల జాబితాను మీ
ముందుంచుతున్నాం. ఇప్పటికే ఆపిల్, శామ్సంగ్, ఎల్జీ, హెచ్టీసీ,
మోటరోలా, హువావీ వంటి గ్యాడ్జెట్ తయారీ
సంస్థలు 4జీ నెట్వర్క్ను సపోర్ట్ చేసే
గ్యాడ్జెట్లను మార్కెట్లోకి అందుబాటులోకి
తెచ్చాయి. వాటి వివరాలు..
- ఆపిల్
ఐఫోన్ 4ఎస్,
- హెచ్టీసీ వెలాసిటీ 4జీ,
- ఎల్జీ థ్రిల్ 4జీ,
- శామ్సంగ్ గుగూల్ నెక్సస్
ఎస్ 4జీ,
- హెచ్టీసీ ఇవో 4జీ,
- హెచ్టీసీ మ్యాక్స్ 4జీ,
- శామ్సంగ్ కాంక్వీర్ 4జీ,
- హెచ్టీసీ ఇవో డిజైన్
4జీ,
- హువావీ
ఇంపల్స్ 4జీ,
- శామ్సంగ్ ఐ997 4జీ,
- శామ్సంగ్ గెలక్సీ ఎస్2
4జీ,
- శామ్సంగ్ ఎగ్జిబిట్2 4జీ,
- మోటరోలా
ఫూటాన్ 4జీ,
- ఎల్జీ ఎస్టీమ్ 4జీ,
- శామ్సంగ్ ఎపిక్ టచ్
4జీ.
0 comments:
Post a Comment