హైదరాబాద్/విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్
నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్
జగన్మోహన్ రెడ్డి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్
జరిగిందని మంత్రి శైలజానాథ్ ఆదివారం విమర్శించారు. వారిద్దరి మధ్య రహస్య ఒప్పందం
కుదిరిందన్నారు. తెలుగుదేశం, కాంగ్రెసుతో టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్న సందర్భాలు వేరు అని ఆయన
అన్నారు.
ఉప ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని
ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలలో జగన్
పార్టీకి ఓటు వేయడంపై సమైక్యవాదులు
ఆలోచించాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని చెప్పారు.
కాంగ్రెసు, టిడిపిల్లో విభజన, సమైక్యవాదం వినిపిస్తోందన్నారు. కాంగ్రెసు ఎన్నికల కోసం పుట్టిన పార్టీ
కాదని దేశం కోసం పుట్టిన
పార్టీ అన్నారు. లోపాయికారి ఒప్పందాలతో ఉప ఎన్నికలు తీసుకు
వస్తున్న జగన్ పార్టీని కనిపెట్టాలన్నారు.
తెలంగాణ
జాగృతి అధ్యక్షురాలు కవితకు దళితులు ఇప్పటికైనా గుర్తుకు రావడం మంచి విషయమన్నారు.
అసెంబ్లీలో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఇది వరకే చెప్పారన్నారు.
ఉప ఎన్నికలలో అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమ ప్రచార అస్త్రాలు
అని ఆయన చెప్పారు. రాష్ట్రం
ఎప్పటికై ఐక్యంగానే ఉంటుందని చెప్పారు.
చిరంజీవిపై
విమర్శలు వద్దు
రాష్ట్రాన్ని
భ్రష్టు పట్టించిన ఘనత తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడిదేనని
దేవాదాయశాఖ మంత్రి సి.రామచంద్రయ్య అన్నారు.
పాలనలో ఏవైనా లోపాలు ఉంటే
ఎత్తి చూపాలని సూచించారు. కానీ నిత్యం ప్రభుత్వంపై
విమర్శలు చేయడం సరికాదన్నారు. రాజ్యసభ
సభ్యుడు చిరంజీవిపై చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదన్నారు.
వైయస్
వేరు జగన్ వేరు
దివంగత
ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి,
వైయస్ జగన్మోహన్ రెడ్డి వేరు అని మరో
నేత మల్లాది విష్ణు విజయవాడలో అన్నారు. ప్రస్తుతం జగన్ను విమర్శిస్తున్న
వారికి వైయస్ అంటే అభిమానముందని
చెప్పారు. ప్రస్తుతం వైయస్ను విమర్శిస్తున్న
వారు ఆయన బతికి ఉన్నప్పుడు
కూడా విమర్శించారని గుర్తు చేశారు. వైయస్ కాంగ్రెసు పార్టీ
నేతే అని, ఆయన ఫోటోతో
ఉప ఎన్నికలకు వెళతామని చెప్పారు. వైయస్ పైన కాంగ్రెసు
విమర్శలు చేస్తుందనేది కేవలం మీడియా ప్రచారమేనని
కొట్టి పారేశారు.
0 comments:
Post a Comment