పురుషులు
సాధారణంగా కఠినమైన ఆహార ప్రణాళికలు ఆచరించరు.
బదులుగా మేము వ్యాయామాలు చేస్తూ
బరువు తగ్గించుకుంటామంటారు. కఠినమైన ఆహార నియమాలు పాటించలేనివారు
తమ అదనపు కొవ్వు తేలికగా
కరిగించుకొని స్మార్ట్ అయిపోవాలంటే క్రింద పేర్కొన్న ఆహారాలు సహకరిస్తాయి.
ఆపిల్స్
- రోజుకు ఒక ఆపిల్ తింటే....డాక్టర్ అవసరం లేదంటారు. అది
నిజమే. మీరు ఆరోగ్యంగా వుండాలంటే
బరువు తగ్గాలంటే ప్రతిరోజూ మీ ఆఫీస్ కు
వెళ్ళేటపుడు ఒక ఆపిల్ తినేయండి.
ఆపిల్ ను పాలు లేదా
పెరుగుతో జతచేసి కూడా తింటే రుచి
మరింత పెరుగుతుంది. ఆపిల్ మీ రక్తంలోని
గ్లూకోజ్ స్ధాయిలు తగ్గించటమే కాదు కరిగే పీచు
కూడా కలిగి వుంటాయి. ఆపిల్స్
లో వుండే పెక్టిన్ శరీరంలోని
అధిక నీటిని, కొవ్వును పీల్చేస్తుంది. అంతేకాదు ఆపిల్ మీకు తినాలనే
వాంఛను కూడా తగ్గించి కొవ్వు
కరిగేందుకు తోడ్పడుతుంది.
నిమ్మ
పండు - నిమ్మ పండ్లలో విటమిన్
సి అధికం శరీరంలోని కేలరీలు
ఖర్చు చేస్తుంది. పురుషులు నిమ్మ, ఆరెంజ్, బెర్రీ, ద్రాక్ష వంటి పండ్లు తింటే
అదనపు కొవ్వు కరిగి పోతుంది. నిమ్మ
బరువును సహజంగా తగ్గిస్తుంది.
గ్రీన్
టీ - చాలామంది కేఫైన్ బరువు వేగంగా తగ్గిస్తుందంటారు.
ఆఫీసులో ఒకసారి కాఫీ తాగేసి బరువు
తగ్గుతామని పురుషులు భావిస్తారు. రీసెర్చి మేరకు కాఫీ గుండె
తీరును వేగం చేస్తుంది. కొవ్వు
వేగంగా కరిగిస్తుంది. అయితే, కేఫైన్ తో పోలిస్తే గ్రీన్
టీ అధిక ప్రయోజనం. బరువు
తగ్గిస్తుంది. ఆకలి నియంత్రిస్తుంది ఆరోగ్యంగా
వుండేలా చేస్తుంది. బరువు తగ్గటమే కాక,
ఈ హెర్బల్ టీ మీ చర్మానికి,
వెంట్రుకలకు కూడా చాలా మంచిది.
మరి ఒత్తిడితో జుట్టు ఊడుతుంటే, మీరు నల్లబడిపోతుంటే గ్రీన్
టీ తాగండి.
బాదం
పప్పులు -బాదం పప్పు, వాల్
నట్, అప్రికాట్ వంటివి మంచి కొవ్వు కలిగించి,
మంచి కొల్లెస్టరాల్ ఇస్తాయి. ఆకలి నియంత్రించాలన్నా, కడుపు
నిండుగా వుంచుకోవాలన్నా ప్రతిరోజూ గుప్పెడు బాదంపప్పులు తినండి.
గుడ్లు
- మీరు మాంసాహారి అయితే, గుడ్డును పూర్తిగా మీ బరువు తగ్గేందుకు
వినియోగించండి. గుడ్లు ఆరోగ్యమే కాదు తేలికగా కడుపు
నింపుతాయి. వాటిని ఉడికించి లేదా అతికొద్ది నూనెలో
వేయించి ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ గా తినండి. గుడ్లను
వెన్నతీసిన పాలతో కూడా తినవచ్చు.
ఈ అయిదు రకాల ఆహారాలు
పురుషులలో కల అధిక శరీర
కొవ్వును కఠినమైన ఆహార ప్రణాళికలు ఆచరించకుండానే
కరిగిస్తాయి. కనుక ఈ ఆహారాలు
మీ ఆహారాలలో చేర్చి ఆరోగ్యంగా, చురుకుగా, ఫిట్ గా వుండేలా
చేసుకోండి.
0 comments:
Post a Comment