ఈ వారంలో భారీ స్ధాయిలో రిలీజవుతున్న
ఎన్టీఆర్ తాజా చిత్రం 'దమ్ము'
. చాలా పాజిటివ్ టాక్ తో ఉన్న
ఈ చిత్రంలో ఎన్టీఆర్ విజయ్ అనే పేరుతో
కనిపిస్తారు. ఈ విషయం దర్శకుడు
బోయపాటి శ్రీను ఖరారు చేస్తూ...ఇందులో
ఎన్టీఆర్ పాత్ర పేరు విజయ.
ఇంకా పెద్ద పేరు గానీ,
అందరూ 'విజయ' అనే చిన్నపేరుతో
పిలుస్తుంటారు అన్నారు. అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్
గురించి చెపుతూ... 'అందరూ బావుండాలి. ఆ
అందరిలో నేనుండాలి' అనేటటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సమాజానికి
మంచి చేయకపోయినా ఫర్వాలేదు కానీ, చెడు చేయకూడదని
నమ్మే వ్యక్తి. ఎవరైనా చెడు చేస్తే వెంటనే
స్పందించే వ్యక్తి అన్నారు. ఇందులో నగర, గ్రామీణ నేపథ్యాలు
రెండూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో 'దమ్ము' ఏ స్థాయి ని
రీచ్ అవుతుందో చెపుతూ....ఏ స్థాయి సినిమా
అవుతుందో నేను చెప్పలేను గానీ,
ఓ మంచి సినిమా తీయడం
వరకే నా బాధ్యత. అయితే
ఒక్కటి మాత్రం చెప్పగలను. నా ముందు 'సింహా'
ఉందని నాకు తెలుసు. దాన్ని
దృష్టిలో పెట్టుకునే ఓ మంచి సినిమా
తీశాను. 'సింహాద్రి' నుంచి ఎన్టీఆర్ ఏ
సినిమాలైతే చేశారో, ఆ సినిమాలన్నింటినీ విశ్లేషించుకునే
'దమ్ము' తీశా. ఏ కోశానా
పాత సినిమాలు ఛాయలు లేకుండా ఓ
భిన్నమైన పాత్రలోనే ఆయన్ని చూపిస్తున్నా. సినిమా చూశాక 'ఎన్టీఆర్లో ఇలాంటి హీరో
ఉన్నాడా' అని ఆశ్చర్యపోతారు. ఎన్టీఆర్
ఈ చిత్రంలో చాలా రాయల్గా
కనిపిస్తారు. డిఫరెంట్ వేరియేషన్స్లో ఆల్రౌండర్గా కనిపిస్తారు అన్నారు.
ఇక చిత్రంలో చేస్తున్న ఇద్దరు హీరోయిన్ల గురించి చెపుతూ...త్రిష, కార్తీక మాత్రమే కాదు, ఇంకో ఇద్దరున్నారు.
'వాస్తు బాగుందే' పాటలో వాళ్లిద్దరు ఎంటరవుతారు.
రచనా మౌర్య, మరియం జకారియా. వాళ్లకీ
కథలో భాగముంది. విలన్ల విషయానికొస్తే... మెయిన్ విలన్గా నాజర్
కనిపిస్తే, సంపత్, కిశోర్, శ్రీధర్రెడ్డి వంటివాళ్లు మిగతా విలన్లుగా చేశారు.
నిర్మాణ విలువలు చాలా బాగుంటాయి. ఈ
సినిమాని కె.ఎస్. రామారావుగారి
లాంటివాళ్లే చేయగలుగుతారు. వేరే వాళ్లు చేయలేరు.
ఎందుకంటే హై బడ్జెట్ సినిమా.
అందువల్ల దీన్ని ఎవరుపడితే వాళ్లు, ఎలా పడితే అలా
చేయలేరు. కె.ఎస్. రామారావు
గారి వల్లే 'దమ్ము'కి ఈ
స్థాయి వచ్చింది అన్నారు.
సినిమాలో
హైలైట్స్ గురించి చెపుతూ...ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ హైలైట్. ఆయన నటన ఎలా
ఉంటుందో ఓ దర్శకుడిగా నేను
చూపించిన 'దమ్ము' ఇది. నన్ను నమ్మండి,
చూడండి. కీరవాణి మ్యూజిక్ ఎలా ఉంటుందో ఇప్పటికే
మీ ముందుకు వచ్చింది. సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో, డైలాగ్స్
ఎలా ఉంటాయో, ఫైట్స్ ఎలా ఉంటాయో, నా
డైరెక్షన్ ఎలా ఉంటుందో ఇప్పటికే
ట్రైలర్స్లో చూపించాను. అన్ని
శాఖల పనితనాన్ని చూపిస్తూ ఓ ట్రైలర్ ద్వారా
మీ ముందుకు వదిలాను. అందులో ఓ పది నుంచి
ఇరవై శాతం మాత్రమే చూపించా.
మిగతా 80 నుంచి 90 శాతం సినిమాలో ఉంటుంది.
ఎన్టీఆర్
హీరోగా రూపొందిన 'దమ్ము' చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకుడు. కె.ఎస్. రామారావు
సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్
పతాకంపై కె.ఎ. వల్లభ
నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం
(27న) విడుదలవుతోంది.
0 comments:
Post a Comment