హైదరాబాద్:
తెలంగాణ ఎజెండాను పూర్తిగా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు
మరో ఎదురు దెబ్బ తగిలింది.
మహబూబ్నగర్ శానససభా స్థానంలో
ఇటీవలి ఉప ఎన్నికల్లో బిజెపి
షాక్ ఇచ్చింది. ఇప్పుడు సిపిఐ రూపంలో మరో
ఎదురు దెబ్బ తగలబోతోంది. పరకాల
ఉప ఎన్నికలో పోటీ చేయాలని సిపిఐ
నిర్ణయం తీసుకుంది. ఇది కెసిఆర్కు
మరింత తలనొప్పిని తెచ్చే పెట్టే ప్రమాదం ఉంది.
తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సిపిఐ ఇటీవలి ఉప
ఎన్నికలకు దూరంగా ఉంది. ఉప ఎన్నికల్లో
తమకు మద్దతు ఇవ్వాలని కెసిఆర్ సిపిఐ కార్యదర్శి కె.
నారాయణ వద్దకు వెళ్లి వేడుకున్నారు. దీంతో సిపిఐ మద్దకు
కూడగట్టుకోగలిగారు. అయితే, వచ్చే ఉప ఎన్నికల్లో
మాత్రం సిపిఐ తనకు లభించిన
అవకాశాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు.
త్వరలో
రాష్ట్రంలోని 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి
ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికలు జరిగే
స్థానాల్లో వరంగల్ జిల్లాకు చెందిన పరకాల ఒక్కటి మాత్రమే
తెలంగాణలో ఉంది. ఈ స్థానంలో
పోటీ చేయాలని ఇప్పటికే బిజెపి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు సిపిఐ సిద్ధపడింది. మరోవైపు
సస్పెన్షన్కు గురైన డిఎస్పీ
నళిని కూడా ఇక్కడ పోటీ
చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.
వైయస్సార్
కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్కు
మద్దతు ఇస్తూ కాంగ్రెసు పార్టీకి
వ్యతిరేకంగా పని చేయడం వల్ల
కొండా సురేఖపై వేటు పడడంతో పరకాలకు
ఉప ఎన్నిక వస్తోంది. సిపిఐ తెలంగాణ జెఎసిలో
భాగస్వామి కాదు. కానీ, తెలంగాణ
అనుకూల వైఖరి తీసుకుంది. అయితే,
ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కార్యాచరణను రూపొందించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందులో భాగంగానే పరకాల నుంచి పోటీ
చేయాలని సిపిఐ భావిస్తోంది.
పరకాల
నుంచి తాము పోటీ చేయాలని
అనుకుంటున్నామని, ఇటీవల ముగిసిన ఉప
ఎన్నికలు పరకాలకు భిన్నమైనవని ఆయన అన్నారు. సిపిఐకి
మద్దతు ఇవ్వలేని స్థితిలో కూడా కెసిఆర్ ఉన్నట్లు
చెబుతున్నారు. దానివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని అంటున్నారు.
0 comments:
Post a Comment