విశాఖపట్నం:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
అరెస్టు చేస్తే వైయస్ రాజశేఖర రెడ్డి
ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యకలాపాలన్నీ బయటకు వస్తాయని తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
అన్నారు. దీంతో కొంత మంది
కాంగ్రెసు నాయకుల గుట్టు రట్టవుతుందని, అందుకే వైయస్ గన్ను
అరెస్టు చేయడానికి ప్రభుత్వం భయపడుతోందని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర
జిల్లాలో ఆయన పర్యటన శనివారం
కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన
పలు సందర్భాల్లో మాట్లాడారు.
వైయస్
జగన్తో కాంగ్రెసు పార్టీ
కుమ్మక్కయిందని, విజయసాయి రెడ్డి విడుదలనే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. విజయసాయి
రెడ్డి సాక్ష్యాలను దాచిపెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు.
అవినీతి వ్యవహారాలన్నీ బయటకు వస్తే సగం
మంది మంత్రులు జైలుకు వెళ్తారని ఆయన అన్నారు. వైయస్
జగన్పై అక్రమాస్తుల కేసులో
ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం
శోచనీయమని ఆయన అన్నారు. చార్జిషీట్లో ఎ-2 గా
పేర్కొన్న విజయసాయి రెడ్డిని అరెస్టు చేసి, ఎ -1గా
పేర్కొన్న వైయస్ జగన్ను
అరెస్టు చేయలేదని ఆయన అన్నారు. సిబిఐ
దర్యాప్తు కూడా ముమ్మరంగా జరగడం
లేదని ఆయన అన్నారు.
ప్రభుత్వమే
లైసెన్స్డ్ అవినీతి చేసిందని
ఆయన ఆరోపించారు. అవినీతిపై ప్రజలు తిరగబడాలని పిలుపు నిచ్చారు. అవినీతిపై పోరాటంలో ప్రజలు తమకు సహకరించాలని ఆయన
కోరారు. విశాఖ ఉడా భూకుంభణంపై
సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో మీకే
తెలుస్తుందని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
చిరంజీవి
వల్ల కాంగ్రెసు పార్టీ లాభపడిందని ఆయన అన్నారు. దళితులకు
కాంగ్రెసు అన్యాయం చేసిందని, తమ పార్టీ అధికారంలోకి
వస్తేనే దళితులకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. సామాజిక
న్యాయం సాధిస్తానని చెప్పుకున్న చిరంజీవి తనకు న్యాయం చేసుకున్నాడని
ఆయన అన్నారు. రోజుకో కుంభకోణం వెలుగు చూస్తోందని ఆయన అన్నారు. జగన్,
కాంగ్రెసు నాయకులు కుమ్మక్కయి దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
బినామీ
మద్యం దుకాణాలతో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ప్రజల
రక్తం తాగుతున్నారని, శాశ్వతంగా జైలులో ఉండాల్సిన బొత్స సత్యనారాయణ దురదృష్టవశాత్తు
రాజకీయాల్లో ఉన్నారని ఆయన అన్నారు. కిరణ్
కుమార్ రెడ్డి పనికిమాలిన ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు.
సొంత నియోజకవర్గం పీలేరులో ముఖ్యమంత్రి ఎర్రచందనం స్మగ్లింగ్ను ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు.
సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం వల్లనే
తాము ఓడిపోయామని ఆయన చెప్పారు. కాంగ్రెసు
అద్దె ఇల్లులాంటిదని, తమ పార్టీ సొంతిల్లు
వంటిదని, పార్టీని వీడిన నేతలు తిరిగి
తమ పార్టీలోకి రావాలని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment