హైదరాబాద్: సెక్స్ కోసం
తనపై రాజకీయ నాయకులు, వ్యాపారులు, పోలీసు అధికారులు తనపై ఒత్తిడి చేశారని వర్ధమాన నటి రాజేశ్వరి అలియాస్ తారా చౌదరి
పోలీసు విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ మేరకు
ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ తన వాంగ్మూలంలో ఈ విషయం వెల్లడించినట్లు ఓ వార్తాకథనం ప్రసారం చేసింది. వ్యభిచారం వ్యాపారంలో తనకు చాలా మందితో పరిచయాలు ఏర్పడ్డాయని, తనకు
ఈ వ్యాపారంలో చాలా
మంది సహకరించారని ఆమె
చెప్పింది.
తనకు చాలా మంది
అమ్మాయిలను సరఫరా చేశారని, వారిలో ఎక్కువగా మహిళలే ఉన్నారని, ఇతర రాష్ట్రాలవారు కూడా అమ్మాయిలను సరఫరా
చేశారని ఆమె చెప్పింది. విపిఐల రాసలీలలను హనీఫ్
సాయంతో రికార్డు చేశానని, వాటిని చూపి డబ్బు
కోసం బ్లాక్ మెయిల్ చేశానని తారా చౌదరి
అంగీకరించింది. అమ్మాయిల అర్ధనగ్న దృశ్యాలను, అశ్లీల దృశ్యాలను చిత్రీకరించానని, తనను ప్రతిఘటించే అమ్మాయిలను వాటిని చూపించి బ్లాక్ మెయిల్ చేశానని ఆమె వివరించింది.
తనతో విఐపిలు చేసిన
సంభాషణలను రికార్డు చేసి
సిడిలుగా మార్చినట్లు చెప్పింది. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు చెప్పింది. హనీఫ్
ముంబైకి ఓ పెళ్లికి హాజరు కావడానికి వెళ్లాడని ఆమె చెప్పింది. తన తప్పు తెలుసుకున్నానని, జీవితంపై విరక్తి చెందానని, పాడు పనులు చేయనని తారా చౌదరి చెప్పింది. తాను బెంగుళూర్ వెళ్లి తన భర్తతో కాపురం చేస్తూ ప్రశాంతంగా జీవిస్తానని ఆమె చెప్పింది.
వ్యభిచారం రొంపిలోకి వచ్చిన అమ్మాయిల వివరాలను కూడా
పోలీసులు తారా చౌదరి
నుంచి సేకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నలుగురు అమ్మాయిలను రప్పించి వారి
వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేసినట్లు చెబుతున్నారు. హనీఫ్
కోసం ఓ పోలీసు బృందం ముంబైకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఓ నటుడు తనకు
హీరోయిన్ చాన్స్ ఇప్పిస్తానని వాడుకున్నాడని తారా చౌదరి
చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. అతనితో విసిగిపోయి వ్యభిచారంలోకి దిగినట్లు ఆమె
తెలిపింది. తారా చౌదరి
వ్యవహారాలపై మీడియాలో పలు
రకాల వార్తాకథనాలు వస్తుండడంతో ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు పేరు బయటకు
వచ్చింది. అయితే, తనకు
తారా చౌదరితో ఏ విధమైన సంబంధం లేదని రాయపాటి స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment