వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ క్రైస్తవ మత ప్రచారకులు కెఏ
పాల్ లక్ష్యంగా చేసుకున్నారా? అంటే అవుననే అంటున్నారు. గత రెండు రోజులుగా కెఏ పాల్ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన
చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన జగన్ను టార్గెట్ చేసినట్లుగానే కనిపిస్తోందని అంటున్నారు. జగన్
తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో కెఏ పాల్కు విభేదాలు ఉన్న
విషయం తెలిసిందే.
దీంతో అప్పుడు వైయస్ను టార్గెట్ చేసిన పాల్ ఇప్పుడు ఆయన తనయుడు జగన్ను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని అంటున్నారు. జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సీమాంధ్రలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ముఖ్యంగా ఓ వర్గానికి చెందిన ప్రజలు దాదాపు ఆయన వైపే ఉన్నారు. దీంతో అదే వర్గానికి చెందిన పాల్ తన రాజకీయ పార్టీ బలోపేతం ద్వారా ఆయనను
దెబ్బతీయాలని చూస్తున్నారని అంటున్నారు.
ఆంధ్రా ప్రాంతంలో కెఏ
పాల్ గతంలో లీడ్లో ఉండేవారు. వైయస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ వచ్చాక ఆయన ప్రభావం కాస్త
తగ్గింది. అయితే ఇప్పుడు వారి కుటుంబానికి అధికారం అండ లేకపోవడంతో ఆ ప్రాంతంలో పూర్వ
వైభవానికి పాల్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో భాగంగా జగన్కు మద్దతు పలుకుతున్న ఆ వర్గం ఓట్లను తన పార్టీ తరఫున
వచ్చే ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలిపి కొల్లగొట్టి జగన్ను రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని అంటున్నారు.
పాల్ ప్రజాశాంతి పార్టీని ఎప్పుడో స్థాపించినప్పటికీ రాజకీయాల గురించి మళ్లీ ప్రధానంగా మాట్లాడుతున్నది ఇప్పుడే. రానున్న ఉప ఎన్నికల్లో పోటీకి కూడా సిద్ధమని ప్రకటించారు. నేతలు వందలు, లక్షల
కోట్లు దోచుకున్నారని, ఏ పార్టీ నాయకులు ఎంత అవినీతికి పాల్పడ్డారో ప్రజలకు తెలుసునని ఆయన
వ్యాఖ్యానిస్తున్నారు. సిబిఐ విచారణ ద్వారా దోచుకున్నది తేలుతుందన్నారు. డబ్బులు, మందు, ముక్క
ఇచ్చి తన కార్యక్రమాలకు జనాన్ని రప్పించుకుంటున్నారన్నారు. ఇప్పుడున్న అవినీతి పార్టీలను ఎవరూ
నమ్మడం లేదని తన పార్టీ అవినీతి నిర్మూలనకు కృషి చేస్తుందని చెబుతున్నారు.
ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో త్వరలో తాను
పర్యటించి అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెబుతున్నారు. తన రాజకీయ పర్యటనకు, మతానికి సంబంధం పెట్టవద్దన్నారు. కొందరు మతాన్ని రాజకీయాలకు ఉపయెగించుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు ఆయన
అన్నది జగన్ను ఉద్దేశించే అనే
వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గతంలో
ఓ నేత తన పైన కక్ష
గట్టి తనకున్న ఓటునే
తీసేయించారని విమర్శించారు. తనను
వంద కష్టాలు పెట్టారన్నారు. ఈ మాటలు కూడా
ఆయన దివంగత వైయస్
పైనే చేశారని అంటున్నారు.
0 comments:
Post a Comment