హైదరాబాద్: తనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఎలాంటి విభేదాలు లేవని
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ
అధ్యక్షుడు, రవాణా శాఖ
మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ఓ టీవీ
ఛానల్ ముఖాముఖి కార్యక్రమంలో చెప్పారు. విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కిరణ్
కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తాను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ
రాయలేదని చెప్పారు.
ఢిల్లీకి రావాలని తమను
ఎవరూ పిలవలేదని బొత్స
చెప్పారు. పార్టీని నడిపే
వ్యక్తికి క్లీన్ ఇమేజ్
ఉండాలన్న ఉద్దేశ్యంతోనే తాను
ఆవేదన చెందుతున్నానని చెప్పారు. పార్టీలో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య విభేదాలు ఉన్నా ఆ పార్టీకి తీవ్రంగా నష్టం కలిగిస్తుందని చెప్పారు. తనకు కిరణ్
పట్ల వ్యతిరేకత ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, తాను ఎప్పుడైనా ఆయనకు
వ్యతిరేకంగా మాట్లాడినట్లు చూపించాలన్నారు.
కిరణ్కు కూడా
తన మీద ఎలాంటి కక్ష లేదన్నారు. ఒకవేళ
ఎవరికైనా వ్యక్తిగతంగా కక్ష
ఉంటే పార్టీ అధ్యక్షుడిని కాబట్టి పార్టీకి నష్టం
జరుగుతుందని భావిస్తారన్నారు. అయినా
తప్పు చేసినప్పుడు కుటుంబ సభ్యులు అయినా, పార్టీ వారయినా ఎవరైనా శిక్షించాల్సిందేనని అన్నారు. మిగతా వారికి ఓ న్యాయం సోంత
వారికి మరో న్యాయం ఉండకూడదన్నారు.
తాను సాయంత్రం ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు. ఉప ఎన్నికలపై అధిష్టానంతో చర్చించేందుకు తాను వెళుతున్నానని అన్నారు. పార్టీలో విభేదాలు ఉంటే బహిరంగంగా మాట్లాడ వద్దని సూచించారు. వచ్చి
చెబితే పార్టీలోనే సర్దుకు పోతుందన్నారు. పార్టీ నేతలు
పిలిచినప్పుడు ఢిల్లీ వెళతామన్నారు. కాగా బొత్స అంతకుముందు తన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి డిఎల్
రవీంద్రా రెడ్డితో భేటీ
అయ్యారు.
0 comments:
Post a Comment