హైదరాబాద్: కరెంట్ ఛార్జీల పెంపుపై ఖైరతాబాదులోని విద్యుత్ సౌద వద్ద ఆందోళన నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు ఈటెల
రాజేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. కరెంట్ ఛార్జీల పెంపు నిరసిస్తూ తెరాస ఆందోళన చేయనున్నదనే నేపథ్యంలో పోలీసులు పలువురు కార్యకర్తలను ముందుగానే అరెస్టు చేశారు. ఆ తర్వాత భారీగా కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
విద్యుత్ సౌధ కార్యాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. పోలీసులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తెరాస
ఆందోళనతో ఖైరతాబాద్ వద్ద
భారీగా ట్రాఫిక్ జాం
అయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ రహదారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో
ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు.
ఆందోళన సందర్భంగా ఈటెల
రాజేందర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఫాలో అవుతున్నారని ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే బాబుకు పట్టిన గతే పడుతుందన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కాంగ్రెసు ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందన్నారు.
వరంగల్ జిల్లాలో తెరాస
శాసన సభ్యుడు వినయ
భాస్కర్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా తెలంగాణవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టిఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
0 comments:
Post a Comment