కడప:
తన తనయుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
విమర్శించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెసు పార్టీ పెట్టుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల
శాసనసభ్యురాలు వైయస్ విజయలక్ష్మి మంగళవారం
ఆరోపించారు. వైయస్ను అబాసుపాలు
చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. జగన్ పైన ఎప్పుడు
ఏ కేసు పెడదామా, ఏం
తిడదామా అనే ఆలోచనలోనే ప్రభుత్వం
ఉందన్నారు. వైయస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు
చేసేందుకు చూస్తోందన్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డి మృతి తర్వాత ప్రజల
సంక్షేమం పట్టించుకున్న నాయకుడు రాష్ట్రంలో లేడన్నారు. కేంద్ర బడ్జెట్ చూస్తే అన్ని రేట్లు పెంచారన్నారు.
పన్నులు వేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని విమర్శించారు.
వైయస్ ముఖ్యమంత్రి కాగానే ఇచ్చిన మాట ప్రకారం ఉచిత
విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారన్నారు.
కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు రద్దు చేశారన్నారు.
కానీ
ఈ ప్రభుత్వం వైయస్ ఆశయాలను నీరుగారుస్తోందన్నారు.
గోరు చుట్టు రోకటి పోటులా చేతివృత్తుల
పైనా విద్యుత్ పెంపు ప్రభావం పడుతుందన్నారు.
పెరిగిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.
వైయస్ విజయమ్మ, మరో నేత ఈసి
గంగి రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పులివెందుల సబ్ స్టేషన్ను
ముట్టడించింది.
శ్రీ
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొవురు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభా నాగిరెడ్డి, భూమా
నాగిరెడ్డి, శ్రీకాకుళంలో ధర్మాన పద్మప్రియ, గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో అంబటి రాంబాబు, విజయనగరం
జిల్లా చీపురుపల్లిలో సూరినాయుడు ఇలా ఆయా జిల్లాలో
ఆయా నేతల ఆధ్వర్యంలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ సబ్ స్టేషన్లను
ముట్టడించి ఆందోళన నిర్వహించాయి.
0 comments:
Post a Comment